Thursday, 3 October 2019

SyeRaa : నయనతార హ్యాండిచ్చింది.. తమన్నాకి కలిసొచ్చింది

ఏదైనా సినిమాలో నటించింది అంటే మాత్రం ఆమెకి, ఆమె పాత్రకి వచ్చే గుర్తింపు వేరు. కానీ ఆమె ఏ సినిమాలో నటించినా కూడా, అది ఎంత పెద్ద సినిమా అయినా కూడా ఆ సినిమా ప్రమోషన్స్‌కి మాత్రం అటెండ్ అవ్వదు. అది ఆమె ఎప్పటినుండో ఫాలో అవుతున్న కండీషనే. సినిమాకి కమిట్ అయ్యే ముందే ఆ విషయం మెన్షన్ చేస్తుంది. అలాగే కాల్ షీట్స్ విషయంలో కూడా ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి నయనతార సైరాకి మాత్రం పారితోషికం దగ్గర పట్టుబట్టినా కూడా ప్రమోషన్స్ విషయంలో మాత్రం తూచ్ అని తన కండిషన్‌ని పక్కనబెట్టారు అని టాక్ వచ్చింది. కానీ తీరా ప్రమోషన్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం మళ్ళీ అంతా మామూలే. నయన్ డుమ్మా కొట్టింది. ఏ ఒక్క ప్రొమోషన్ ఈవెంట్‌లో కూడా ఆమె కనిపించలేదు. Also Read: నయనతార ప్రమోషన్స్‌కి రాకపోవడం అనేది మరొక హీరోయిన్‌కి బాగా హెల్ప్ అయ్యింది. ఆమె తమన్నా. ముంబై ప్రమోషన్స్ నుండి కన్నడ వరకు కూడా ఆమె ప్రమోషన్స్‌లో పాల్గొంది. బాలీవుడ్‌లో అయితే ఇంగ్లీష్ మాట్లాడడానికి చిరు కాస్త ఇబ్బందిపడుతుంటే మాత్రం అదరగొట్టింది. సైరా కి అక్కడ కూడా భారీ ప్రమోషన్స్ చేశారు.ఆ ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా కూడా బాగా ఫోకస్ అయ్యింది. ఒక వేళ నయనతార కూడా ప్రమోషన్స్‌కి వచ్చుంటే తమన్నా పై అంత ఫోకస్ ఉండి ఉండేది కాదు. పైగా తమన్నాని కేవలం ముంబై ప్రమోషన్స్ వరకే పరిమితం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ప్రోమోట్ చేసి డౌన్ లో ఉన్న తన కెరీర్ మళ్ళీ కాస్త హై తెచ్చుకుంది తమన్నా.ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే సైరాలో సోలో హీరోయిన్ తమన్నా, నయనతార జస్ట్ గెస్ట్ అప్పీరెన్స్ అన్నట్టు ఉంది. Also Read: నిజానికి సైరా‌లో నయనతార పాత్ర ఎంత ఉంటుందో తమన్నా పాత్ర కూడా అంతే నిడివితో ఉంటుంది. పైగా సినిమాలో కూడా తమన్నా పాత్రకి మంచి వెయిట్ ఉంది. ఇప్పుడు ఆమె ప్రమోషన్స్‌లో కూడా ఫోకస్ అవ్వడంతో సైరా సక్సెస్ క్రెడిట్‌లో తమన్నా కి కూడా షేర్ దక్కుతుంది. రీసెంట్‌గా జరిగిన సైరా థాంక్స్ మీట్‌లో కూడా తమన్నా పాల్గొంది. పక్కనేకూర్చుంది. అలా సినిమా రిలీజ్‌కి ముందు రిలీజ్ తరువాత కూడా తమన్నాకి ఫుల్ క్రెడిట్ దక్కింది. నయనతార పెద్ద హీరోయిన్ అయినా కూడా సైరా సినిమా విషయంలో మాత్రం తమన్నాకే పేరొచ్చింది. మిగతా సినిమాల విషయంలో ఎలా ఉన్నా కూడా ఇలాంటి సినిమాలకయినా నయన్ ప్రచారం చేస్తే బావుంటుంది. ఇప్పుడు కెరీర్ పీక్స్‌లో ఉంది కదా అని నెగ్లెక్ట్ చేస్తే ముందు ముందు ఆమెని పక్కనబెట్టేస్తారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2nfyog6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...