Tuesday, 1 October 2019

Sye Raa: అల్లు అర్జున్ చెప్పేసాడుగా.. మళ్ళీ ఇది దేనికి?

ఏది చేసినా అది సెన్సేషన్ అవుతుంది. అయితే దాని రిజల్ట్ మంచిగా ఉంటే పర్లేదు. కానీ నెగెటివిటీ ఎదురవుతుంది. అప్పట్లో పవన్ కళ్యాణ్‌తో గొడవ అనేది పెద్ద ఇష్యూ అయ్యింది. ఈ‌లోగా మెగా క్యాంప్‌కి దూరంగా జరుగుతున్నాడు అని టాక్. ధ్రువ టైమ్‌లో చరణ్ తీసుకున్న డెసిషన్స్‌తో అది నిజమే అంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ పుట్టాయి. ఇక DJ సినిమా కలెక్షన్స్ ఖైదీ నెంబర్ 150ని కొట్టేశాయి అని అనౌన్స్ చెయ్యడంతో కొంతమంది మెగా ఫ్యాన్స్ దిల్ రాజు ఆఫీస్ దగ్గర హడావిడి చేసి ఆ కలెక్షన్స్ నోట్‌ని వెనక్కు తీసుకోవాలని కండిషన్ పెట్టారు. అలా అలా అనుకోకుండానే అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్‌కి కాస్త దూరం అవుతూ వచ్చాడు. Also Read: బన్నీకి కూడా టాలెంట్ పుష్కలంగా ఉంది. మాస్‌లో కూడా మంచి గుర్తింపు ఉంది. దీంతో అతనికి కూడా వేరే ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. అందుకే బన్నీ కూడా ఆ పరిస్థితులను తట్టుకుని నిలబడగలిగాడు. కానీ ఇప్పుడు సైరా విషయం వేరు. మెగా ఫ్యామిలీ, మెగా కాంపౌండ్..ఇలా ఏది మాట్లాడుకున్నా కూడా దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి. అలాంటి చిరంజీవిని రామ్ చరణ్ నెగ్లెక్ట్ చేసిన కూడా తట్టుకోలేరు చాలా మంది ఫ్యాన్స్. మరి అలాంటిది ప్రాణం పెట్టి, ఎంతో కష్టపడి తన కలను నిజం చేసి అందిరితో సెల్యూట్స్ కొట్టించుకుంటున్నప్పుడు అల్లు అర్జున్ రాకపోతే, ఆ సినిమా ట్రైలర్ ఎలా ఉంది అని పలకకపోతే కోపం రావడం, నెక్స్ట్ సినిమా ఉందిగా అప్పుడు చూసుకుందాం అనడం కామన్. అయితే పరిస్థితి మరీ చెయ్యిదాటకముందే ఒక ఓపెన్ లెటర్ రాసి మేనమామ చిరంజీవిని, బావ రామ్ చరణ్‌ని, వాళ్ళు తీసిన సైరా సినిమాని కూడా ఒక రేంజ్‌లో పొగిడేసాడు బన్నీ. Also Read: ఆ ఇష్యూ అక్కడితో క్లోజ్, కాకపోతే మళ్ళీ ఇప్పుడు స్పెషల్‌గా బన్నీ తరపు PRO ఒక ట్వీట్ పెట్టాడు. దాంట్లో ఎవ్వరి పేరు మెన్షన్ చెయ్యకపోయినా, దేని గురించి అనేది స్పెషల్‌గా చెప్పకపోయినా కూడా సింపుల్‌గా మ్యాటర్ అర్ధమైపోతుంది. 'ప్రేమ, ఆప్యాతవల్ల పనులు జరుగుతాయి కానీ ప్రెజర్ వల్ల కాదు. మనకి ఒక పని చెయ్యాలి అని అనిపించుకోకపోతే ఎంత వత్తిడి వచ్చినా మనం అది చెయ్యం, ఇక్కడ మొత్తం ప్రేమే, ఎలాంటి ద్వేషం లేదు' అనేది ఆ ట్వీట్. Also Read: ''నిజంగా అక్కడ అలాంటిది లేకపోతే అసలు ఈ ట్వీట్ వేయాల్సిన అవసరం ఏంటి?. మన మనసులో అభిమానం ఉంటే దాన్ని చూపించుకోవడానికి కూడా ముహుర్తాలు చూసుకుంటామా?, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు సాధారణ ప్రేక్షకులే గూస్ బంప్స్ వచ్చి సినిమాపై సూపర్ పాజిటివ్‌గా స్పదించినప్పుడు బన్నీ ఎక్కడ ఉన్నాడు?''...ఇవీ ఇప్పుడు ఈ ట్వీట్ వల్ల మెగా ఫ్యాన్స్ నుండి దూసుకువస్తున్న ప్రశ్నలు. మరి వీటికి కూడా సమాధానాలు వెతుక్కుని మళ్ళీ పోస్ట్ చేస్తారా? లేక జరిగింది అందరికి అర్ధమైంది అని కామ్ అయిపోతారా అనేది ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో జరుగుతున్న లేటెస్ట్ డిస్కషన్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2nkSLZ6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...