Saturday, 26 October 2019

Prabhas హీరోయిన్.. చీర కట్టులోనూ కత్తిలా ఉంది

శ్రీలంకన్ బ్యూటీ, బాలీవుడ్ నటి జాక్వెలీన్ ఫెర్నాండెజ్‌కు మంచి ఫిగర్ ఉంది. సినిమాలో ఆమె నటన ఎలా ఉన్నప్పటికీ ఆమెను తెరపై చూసి సంబరపడిపోయే అభిమానులు కోకొల్లలు. ఎప్పుడూ ట్రెండీ, వెస్ట్రన్ డ్రెస్సులో కుర్రకారు మతిపోగొట్టే జాక్వెలీన్ ఈసారి సంప్రదాయానికి ఓటేసింది. దీపావళి సందర్భంగా చీర కట్టుకుంది. చేతిల దీపాలు పట్టుకుని దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇక ఫ్యాన్స్ ఆగుతారా? లైక్‌ల టపాసులు మోగించారు. పింక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో ఉన్న చీరకట్టులో జాక్వెలీన్ కత్తిలా ఉంది. పైగా ఆ చీర కూడా మామూలుగా లేదు. కింద మొత్తం స్కర్ట్‌లా పైనంతా లంగావోణీలా చాలా వెరైటీగా ఉంది. అయినా జాక్వెలీన్ కదా.. ఆ మాత్రం స్టైలిష్‌గా కనిపించొద్దూ. ‘అలాద్దిన్’ సినిమాతో జాక్వెలీన్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘రేస్ 3’, ‘జుడ్వా 2’, ‘హౌస్‌ఫుల్ 3’, ‘డిషూం’ వంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటించారు. కెరీర్ మొదట్లో జాక్వెలీన్‌కు అన్నీ హీరోతో ముద్దు సీన్లలో నటించే అవకాశాలే వచ్చేవి. ఆ తర్వాత ఆమెకు సోషల్ మీడియాలో ఉన్న పాపులారిటీ చూసి కాస్త మంచి అవకాశాలు వచ్చాయి. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమాలో ఆయనతో కలిసి ‘బ్యాడ్ బాయ్’ పాటలో ఆడిపాడింది జాక్వెలీన్. ఈ పాట తర్వాత ఐటెం సాంగ్స్‌లో నటించేందుకు తెలుగులో జాక్వెలీన్‌కు మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం జాక్వెలీన్ ‘కిక్ 2’ సినిమాలో నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్‌తో కలిసి మరోసారి జోడీ కట్టబోతున్నారు. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘కిక్’ సినిమాను హిందీలో సల్మాన్ ఖాన్ ఇదే టైటిల్‌తో రీమేక్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీయనున్నారు. 2020లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. జాక్వెలీన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జంటగా నటించిన ‘డ్రైవ్’ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. సినిమాకు కలెక్షన్లు రాకపోతే తన నిర్మాణ సంస్థ ఎక్కడ మూతపడిపోతుందోనని భయపడిన కరణ్ జోహార్ థియేటర్‌లో రిలీజ్ చేయడానికి ఒప్పుకోలేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PmFmLM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...