దీపావళి అంటేనే వెలుగుల పండుగ. అసలు.. దీపావళి ఎందుకు జరుపుకుంటాం అనే కథను పక్కనబెడితే.. ఈ పండుగ రోజున ఇంటిళ్లపాది ఎంతో సంతోషంగా గడుపుతారన్నది వాస్తవం. ఉదయం పూజలు, పిండి వంటలు చేసుకుని.. సాయంత్రం కుటుంబమంతా కలిసి ఎంతో ఉత్సాహంగా టపాసులు కాలుస్తారు. అయితే, మెగాస్టార్ చిరంజీవి ఇంట ఈ దీపావళి మరింత కాంతివంతంగా జరిగింది. ఎందుకంటే, ఈ దీపావళి రోజున కేవలం చిరంజీవి కుటుంబమే కాకుండా మొత్తం కొణిదెల ఫ్యామిలీ అంతా కలిసి సంబరాలు జరుపుకుంది. ఆదివారం రాత్రి చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ, నాగబాబు కుటుంబం పాల్గొన్నాయి. అన్నయ్యతో కలిసి ఈ ఇద్దరు మెగా బ్రదర్స్ దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే, ఈ వేడుకల్లో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన నలుగురు పిల్లలతో కలిసి (రేణు దేశాయ్ పిల్లలు అకీరానందన్, ఆద్య.. అన్నాలెజినోవా పిల్లలు మార్క్ శంకర్ పవనోవిచ్, పొలెనా అంజన పవనోవ) పాల్గొన్నారు. అలాగే పవన్ భార్య అన్నాలెజినోవా కూడా పాల్గొన్నారు. Also Read: తల్లి అంజనాదేవీతో కలిసి చిరంజీవి, సురేఖ, నాగబాబు అండ్ ఫ్యామిలీ, పవన్ అండ్ ఫ్యామిలీ సహా ఇతర కుటుంబ సభ్యులు దీపావళి సంబరాలను జరుపుకున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పవన్ కళ్యాణ్.. తన నలుగురు పిల్లలు, భార్య అన్నాలెజినోవాతో కలిసి ఉన్న ఫొటోను అయితే విపరీతంగా షేర్ చేస్తున్నారు. అలాగే, పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌ను చిరంజీవి ఆప్యాయంగా ఎత్తుకున్న ఫొటో కూడా బాగా వైరల్ అవుతోంది. మొత్తానికి మెగా అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా మెగా బ్రదర్స్ అందరినీ ఒకే చోట చూసి మురిసిపోతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను కుంటుంబ సమేతంగా చూసి తెగ ఆనంద పడిపోతున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MUO6Y6
v
No comments:
Post a Comment