Thursday, 10 October 2019

హీరోపై ఫైర్‌ అయిన నిర్మాత.. ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌లో కంప్లయింట్‌

తన సినిమాలతో కన్నా ఎక్కవుగా వివాదాలతోనే వార్తల్లో ఉండే నటుడు శింబు. దర్శకుడు, నటుడు, నిర్మాత టీ రాజేందర్‌ వారసుడిగా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన కెరీర్‌ స్టార్టింగ్‌లో వరుసగా విజయాలతో సత్తా చాటాడు. దమ్‌, మన్మథన్‌, వల్లవన్‌ లాంటి బ్లాక్ బస్టర్‌ హిట్స్ సాధించిన శింబు.. గాయకుడిగా దర్శకుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే షూటింగ్‌లకు సరైన సమయానికి రాకుండా నిర్మాతలను ఇబ్బంది పెడతాడన్న పేరు శింబుకు ఫస్ట్ నుంచి ఉంది. గతంలోనూ పలువురు నిర్మాతలు ఇదే విషయంలో శింబుపై కంప్లయింట్ ఇచ్చారు. అంతేకాదు శింబు హీరోగా ప్రారంభమైన ఖాన్‌, మానాడు చిత్రాలు ఇవే కారణాలతో మధ్యలోనే ఆగిపోయాయి. తాజాగా మరో సినిమా కూడా ఈ లిస్ట్‌లో చేరిందన్న టాక్‌ వినిపిస్తోంది. గతంలో ఓ పాట విషయంలో శింబు వివాదాల్లో చిక్కుకున్నాడు.అనిరుద్‌ తో కలిసి రూపొందించిన బీప్‌ సాంగ్ శింబు కెరీర్‌ను తల కిందులు చేసింది. ఆ పాట కారణంగా సినిమా అవకాశాలు కోల్పోయిన శింబు, కొంత కాలం అజ్ఞాతంలో గడపాల్సి వచ్చింది. Also Read: కన్నడలో సూపర్‌ హిట్ అయిన మఫ్టీ సినిమాను తమిళ్‌లో శింబు, గౌతమ్‌ కార్తీక్‌లు హీరోలుగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు నర్తన్‌ దర్శకత్వంలో స్టూడియ్ గ్రీన్‌ నిర్మాత జ్ఞానవేల్‌ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కన్నడలో శివరాజ్‌ కుమార్‌, శ్రీమురళి నటించిన పాత్రల్లో శింబు, గౌతమ్‌ కార్తీక్‌లను తీసుకున్నారు. తొలి షెడ్యూల్‌ కర్ణాటకలోని బల్లారిలో షూటింగ్ చేశారు. తరువాత లాంగ్ గ్యాప్‌ తీసుకున్న చిత్రయూనిట్ రెండో షెడ్యూల్‌ను ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ సినిమా ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. తొలి షెడ్యూల్‌లో శింబు షూటింగ్‌కు సరిగా రాకపోవటంతో నిర్మాతకు చాలా నష్టం కలిగిందట. అంతేకాదు ఇతర నటీనటులు కాల్షీట్స్‌ కూడా వేస్ట్ అయ్యాయని నిర్మాత జ్ఞానవేల్‌ రాజా ఫైర్‌ అయ్యారు. Also Read: తొలి షెడ్యూల్‌ షూటింగ్ సమయంలో తనకు దాదాపు 40 లక్షల వరకు నష్టం వచ్చిందన్న నిర్మాత ఆ నష్టా్న్ని శింబునే భరించాలంటూ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. ఈ పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఒక వేళ సినిమా కంటిన్యూ అయిన శింబు స్థానంలో మరో హీరోను తీసుకొని సినిమా తెరకెక్కించే ఆలోచనలో నిర్మాతలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ వార్తలపై శింబు ఎలా స్పందిస్తాడా అన్న ఆసక్తి నెలకొంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2AXuICP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...