Wednesday, 2 October 2019

‘సల్మాన్‌కి దమ్ముందా.. నాచేత పాడించుకుంటాడా?’

బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తంలో దేశభక్తి తానొక్కడికే ఉందని అంటున్నారు ప్రముఖ సింగర్ . ఇండియా టుడే నిర్వహించిన సఫాయ్‌గిరి సమ్మిట్ అవార్డ్స్‌లో అభిజీత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ భక్తి గురించి, పాకిస్థానీ గాయకుల గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘మన దేశ అభివృద్ధి కోసం చాలా కొద్ది మంది ముందడుగు వేశారు. జాతిపిత మహాత్మాగాంధీ దేశం కోసం ఎంతో చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేశారు. ఆ తర్వాత స్థానంలో నేనే ఉన్నా. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉంటూ దేశం తరఫున మద్దతుగా నిలిచాను. ఒకవేళ మన దేశంలోకి ఓ పాకిస్థానీ వస్తే అతని పేరు న్యూస్ పేపర్‌లో పడితే కొందరు తెగ మండిపోతుంటారు. వారిపై ఎంత కోపం వచ్చినా పాకిస్థానీల కెమెరాలు మాత్రం పగలగొట్టే ధైర్యం ఎవ్వరికీ ఉండదు. నేను ఈ మాట 1990 నుంచి చెబుతూనే ఉన్నాను. నాకు పాకిస్థానీయులతో ఎలాంటి సమస్య లేదు. చెప్పాలంటే దేశ భక్తి అంటే ఏంటో పాకిస్థానీయుల నుంచే నేర్చుకోవాలి. ఎందుకంటే.. వారు మన దేశంలో తిని తిరిగి పాకిస్థాన్‌కు వెళ్లి మన దేశం గురించే తప్పుగా మాట్లాడతారు. అలాంటప్పుడు వారిని మనం ఎందుకు తిట్టాలి? వారు వారి దేశం గురించే గొప్పగా మాట్లాడుతున్నారు కదా? నేను ఇప్పటివరకు ఏ పాకిస్థానీ గాయకుడి పేరును బయటికి తీయలేదు. వారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. పాకిస్థాన్‌కు చెందిన కొందరు మన ఇండియాకు వచ్చి ఏలుతున్న వారి గురించి నేను కామెంట్ చేస్తాను’ ‘సింగర్ అర్జీత్ సింగ్‌పై కోపంతో సల్మాన్ ఖాన్ తన సినిమాలో ఆయన పాడిన పాడను పాకిస్థానీ గాయకుడు అయిన రహత్ ఫతే అలీ ఖాన్ చేత పాడించుకున్నాడు. మన గాయకుడైన సోనూ నిగమ్‌పై ఓ పాకిస్థానీ ఫత్వా జారీ చేశాడు. అతని తరఫున నేను మాత్రమే నిలిచాను. సల్మాన్ ఖాన్‌కు దమ్ముంటే నా చేత పాట పాడించుకుని ఆ పాటను మరొకరి చేత డబ్ చేయించుకోమనండి. బాలీవుడ్‌లో దేశ భక్తి కలిగినవారు ఎవరైనా ఉన్నారంటే అది నేను మాత్రమే. ఇప్పటివరకు బాలీవుడ్‌కు చెందిన ఒక్క సెలబ్రిటీ కూడా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదు. కేవలం ఉగ్రవాదం గురించి మాట్లాడారే తప్ప పాక్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అభిజీత్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2nJvnEP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...