Wednesday, 2 October 2019

వార్ ఫస్ట్ డే కలెక్షన్స్: అంచనాలు దాటలేకపోయినా.. దుమ్మురేపింది

యాక్షన్ సినిమాలు చేస్తే మేమే చేయాలి అని మరోసారి నిరూపించారు బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్. ఈ ఇద్దరు సూపర్‌స్టార్స్ నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. గాంధీ జయంతి సందర్భంగా మంగళవారం విడుదలైన ఈ సినిమా తొలిరోజే రూ.50 కోట్లు వసూలు చేసిందని బాక్సాఫీస్ ఇండియా రిపోర్ట్ చెబుతోంది. హృతిక్, టైగర్ సినిమాపై ముందు నుంచీ అంచనాలు ఉన్నాయి. తొలిరోజు సినిమా రూ.55 కోట్ల వసూళ్లు రాబడుతుందని ఎప్పటినుంచో సినీ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ వారి అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ఈ సినిమా ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ కలెక్షన్లను కూడా దాటలేకపోయింది. అవెంజర్స్ సినిమా ఇండియాలో తొలి రోజు రూ.53 కోట్లు రాబట్టింది. అయితే హృతిక్, టైగర్ కెరీర్లలో ‘వార్’ సినిమా బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. తొలిసారి ఈ సూపర్‌స్టార్స్ కలిసి నటించిన సినిమా ఇది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. వాణీ కపూర్ కథానాయికగా నటించారు. మంగళవారం ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో పాటు తెలుగులోనూ వార్ సినిమా విడుదలైంది. నిన్న సైరా, వార్‌తో పాటు హాలీవుడ్ చిత్రం జోకర్ కూడా విడుదలైంది. అయితే వార్‌తో సైరా, జోకర్‌ పోటీపడలేవని విశ్లేషకులు మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు. ఆ రకంగా చూసుకుంటే హిందీలో వార్‌ సినిమాకే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. సైరా హిందీ వెర్షన్‌కు రూ1.5 కోట్లు వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వార్ సినిమా విడుదల అవ్వడానికి ముందు తమ సినిమాలతో పాటు జోకర్, సైరా సినిమాలకు సంబంధించిన అన్ని విషయాలు ముందే వెల్లడించేసి సినిమాను దెబ్బతీయొద్దని టైగర్, హృతిక్ ముందుగానే అభిమానులను వేడుకున్నారు. ఈ సినిమా కోసం చెమట, రక్తం చిందించామని, ఈ భారీ యాక్షన్ సినిమాను బిగ్ స్క్రీన్‌పైనే చూడాలని కోరారు. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో సినిమాను ఆదిత్య చోప్రా తెరకెక్కించారు. చూడబోతే పెట్టిన బడ్జెట్ కేవలం మూడు రోజుల్లోనే కలెక్షన్ల రూపంలో వచ్చేస్తుందని సినీ ఎనలిస్ట్‌లు అంటున్నారు. మొత్తానికి తాను గురూజీగా భావించే హృతిక్ రోషన్‌తో కలిసి సినిమా చేయాలన్న కలను నెరవేర్చుకున్నాడు టైగర్. సినిమా మంచి విజయం అందుకోవడం కూడా కలిసిరావడంతో టైగర్ ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2n4tQcc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...