లేడీ సూపర్ స్టార్ నయనతారకు, ఆమె నటించే సినిమాలకు ప్రత్యేకంగా ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ‘చంద్రముఖి’ సినిమా నుంచి మొన్న విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా వరకు నయన్ తానేంటో నిరూపించేసుకున్నారు. తన నటనతో ఎందరో ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. లేడీ సూపర్ స్టార్ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌ను తన పేరు చివర తగిలించుకున్నారు. అయితే సినిమాల్లో నటిస్తారే తప్ప వాటికి సంబంధించిన ఎలాంటి సినిమాల ప్రమోషనల్ ఈవెంట్స్‌లో పాల్గొనరు. ఈ రూల్‌ను నయన్ ‘చంద్రముఖి’ సినిమా నుంచి ఫాలో అవుతున్నారు. సినిమాకు సంతకం చేసే ముందే నయన్ ఈ విషయాన్ని కచ్చితంగా నిర్మాతలకు చెబుతారు. వారు ఓకే అంటేనే సినిమాకు సంతకం చేస్తారు. అయితే ఆమె ఎందుకు ఈ రూల్‌ని ఫాలో అవుతున్నారు అన్న విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా నయన్ ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ వోగ్ నిర్వహించిన ఇంటర్వ్యూలో నయన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నా ఆలోచనలు ఏంటో, నా అభిప్రాయాలేంటో ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం. నేను నా విషయాలను ప్రైవేట్‌గా ఉంచుకోవాలని అనుకుంటాను. నాకు జనాల గుంపులో కలవడం నచ్చదు. చాలా సార్లు నేను చెప్పాలనుకున్న విషయాలను సరిగ్గా అర్థంచేసుకోక తప్పుగా రాసేశారు. అవన్నీ భరించలేకపోయేదాన్ని. నా ఉద్యోగం కేవలం నటించడం వరకే. మేమేంటో మా సినిమాలే మాట్లాడతాయి’ అని వెల్లడించారు నయన్. అయితే ‘సైరా’ భారీ సినిమా కావడంతో ప్రమోషనల్ ఈవెంట్స్‌కు వెళ్లకూడదు అన్న రూల్‌ను నయన్ పక్కనబెట్టేలా ఉన్నారు అన్న టాక్ వినపడింది. కానీ నయన్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు. సైరా టీం నుంచి కథానాయికగా తమన్నా మాత్రమే పాల్గొన్నారు. దాంతో తమన్నాకు అది బాగా కలిసొచ్చింది. ప్రస్తుతం నయన్ తమిళ స్టార్ విజయ్‌కు జోడీగా బిగిల్, సూపర్ స్టార్ రజనీకాంత్‌కు జోడీగా దర్బార్ సినిమాల్లో నటిస్తున్నారు. నయన్ ప్రమోషన్స్‌లో పాల్గొనట్లేదన్న విషయంపై గతంలో ప్రముఖ తమిళ నటుడు రాధా రవి అసభ్యంగా మాట్లాడారు. నయన్ తన సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో కూడా పాల్గొనదని, కళ్లు నెత్తికెక్కాయని అన్నారు. దీనిపై నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ మండిపడ్డారు. ఇలాంటివారి మాటలను తాను పట్టించుకోనని నయన్ ఓ ప్రెస్ నోట్‌ను రిలీజ్ చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30OI7rj
v
No comments:
Post a Comment