Friday, 25 October 2019

స్విమ్మింగ్ పూల్‌లో కరిష్మా.. బికినీలో బోల్డ్‌గా!

నాలుగు పదుల వయసులోనూ చెక్కు చెదరని అందంతో మెరిసిపోతున్నారు బాలీవుడ్ నటి . 1990, 2000లలో ఆమె అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే కథానాయికగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పెళ్లై పిల్లలు పుట్టడంతో పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. సినిమాలు చేయకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఆమెకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఫైన్ వైన్ లాగా ఆమె వయసు పెరిగే కొద్దీ అందం రెట్టింపవుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కరిష్మా ఎప్పటికప్పుడు తన ఫొటోలతో కుర్రకారు మతిపోగొడుతుంటుంది. తాజాగా కరిష్మా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్ట్ చేసింది. బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోను అభిమానుల కోసం షేర్ చేసింది. ఇంకేముంది.. కరిష్మాను అలా చూసేటప్పటికీ అందరి మైండ్ బ్లాక్ అయిపోయింది. టకటకా లైక్‌లు కొట్టడం తప్ప మరేమీ చేయలేకపోయారు. ఈ ఫొటోకు మూడు లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. ఆమె 40 ఏళ్లంటే ఎవ్వరూ నమ్మరని, ఇప్పటికీ సినిమాల్లో తీసుకుంటే మిగతా హీరోయిన్లకు స్ట్రాంగ్ పోటీ ఇస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చాలా కాలంగా సినిమాలకు దూరమైన కరిష్మా ఇలా సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేస్తూ తన స్టార్‌డంను కాపాడుకుంటోంది. కరిష్మా బయటికి వెళ్లిన ప్రతీసారి ఫొటోగ్రాఫర్లు ఆమె ఫొటోల కోసం వెంటపడుతుంటారు. ఎక్కువగా కరిష్మా తన చెల్లి కరీనా, స్నేహితులు మలైకా అరోరాలతోనే కనిపిస్తూ ఉంటారు. వీరు ముగ్గురూ తరచూ పార్టీలకు వెళుతుంటారు. కుటుంబం కోసం సినిమాలకు దూరమైన కరిష్మాకు వైవాహిక జీవితం కూడా సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. తన చిన్ననాటి స్నేహితుడు సంజయ్ కపూర్‌ను కరిష్మా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఐదేళ్లుగా వీరి మధ్య తగదాలు వస్తూనే ఉండటంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కరిష్మా సందీప్ తోష్నీవాల్ అనే వ్యాపారవేత్తోత డేటింగ్ చేశారు. కొంతకాలం తర్వాత వీరు కూడా విడిపోయారు. మరోపక్క సంజయ్ ప్రియ అనే దిల్లీకి చెందిన మోడల్‌ను వివాహం చేసుకున్నారు. ఓసారి పెళ్లి గురించి మీడియా వర్గాలు కరిష్మాను ప్రశ్నిస్తే.. తనకు అలాంటి ఆలోచనలు లేవని, ఇక జీవితం తన పిల్లలకే అంకితమని తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WhkneF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...