Wednesday, 9 October 2019

ఆ గే డైరెక్టర్‌‌తో సెల్ఫీ కోసం ఎగబడిన బాడీగార్డ్స్..!

మీకు ఓ సెలబ్రిటీ ఎదురైతే ఏం చేస్తారు? వెంటనే వారితో సెల్ఫీ దిగడమో లేక వారి ఫొటోలు తీయడమో చేస్తారు. ఫ్యాన్స్ అయితే తమకిష్టమైన సెలబ్రిటీలతో సెల్ఫీ దిగేందుకు వారిని వెంబడించడం కూడా చూసే ఉంటారు. ఫ్యాన్స్ సంగతి అటుంచండి. 24 గంటల్లూ సెలబ్రిటీలకు రక్షణగా నిలిచే బాడీగార్డ్స్ పరిస్థితేంటి? మనకు సెలబ్రిటీలు ఎప్పుడో కానీ కనిపించరు. కానీ బాడీగార్డ్స్‌కు రోజూ వారిని చూసే అవకాశం ఉంటుంది. అయితే ఓ సెలబ్రిటీ కోసం బాడీగార్డ్స్ సెల్ఫీల కోసం ఎగబడిన ఘటన వైరల్‌గా మారింది. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్. దసరా సందర్భంగా మంగళవారం ముంబయిలోని ఓ దుర్గామాత ఆలయానికి వెళ్లారు. ఆయనతో పాటు నటి నటాషా పూనావాలా కూడా ఉన్నారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆయన తన కారువైపు నడుచుకుంటూ వెళుతుండగా ఆయనకు రక్షణ కల్పించాల్సిన బాడీగార్డ్స్ సెల్ఫీల కోసం ఎగబడ్డారు. కరణ్ కూడా వారు సెల్ఫీలు తీసుకుంటానంటే ఏమీ అనలేదు. ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరణ్ జోహార్ సక్సెస్‌ఫుల్ నిర్మాత అని అందరికీ తెలిసిందే. కానీ ఆయనో గే అన్న విషయం అతికొద్ది మందికి తెలుసు. అందుకే ఆయన ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి వారికి ఏ లోటూ రాకుండా చూసుకుంటున్నారు. అయితే ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు కరణ్‌పై కామెంట్లు చేస్తూ.. ‘గే డైరెక్టర్‌తో సెల్ఫీలేంటి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కరణ్ వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. తెలుగులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ‘గీత గోవిందం’ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మించనున్నారు. దీంతో పాటు ఆయన ‘తఖ్త్’ అనే హిస్టారికల్ నేపథ్యంలో సాగే సినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నారు. ఇందులో రణ్‌వీర్ సింగ్, జాన్వి కపూర్, కరీనా కపూర్, విక్కీ కౌషల్, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VsS7pc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...