Wednesday, 23 October 2019

సెట్స్‌లో నన్ను ఎక్కడ పడితే అక్కడ పట్టుకున్నాడు: నటి

ప్రముఖ బుల్లి తెర నటుడు, సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్ బాస్ 13 కంటెస్టెంట్ సిద్ధార్థ్ శుక్లాపై షాకింగ్ ఆరోపణలు వచ్చాయి. హిందీలో బాగా పాపులర్ అయిన ‘బాలికా వధు’ సీరియల్‌లో ప్రధాన పాత్రలో నటించిన సిద్ధార్థ్ శుక్లా తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని నటి ఆరోపిస్తున్నారు. ‘బాలికా వధు’ సీరియల్‌లో సిద్ధార్థ్, షీతల్ భార్యాభర్తలుగా నటించారు. షూటింగ్ సమయంలో సెట్స్‌లో సిద్ధార్థ్ తనను ఎక్కడి పడితే అక్కడ పట్టుకునేవాడని, తనకు అసహ్యమేసేదని తెలిపారు. ‘బిగ్‌బాస్ షోలో ఓ అమ్మాయిని నోటికొచ్చినట్లు కామెంట్లు చేశాడని ఓ వ్యక్తిని కోపగించుకున్నాడు సిద్ధార్థ్. ఈ విషయం నేను పడి పడి నవ్వుకున్నాను. ఎందుకంటే సిద్ధార్థ్.. నాతో ‘బాలికా వధు’ సెట్స్‌లో అసభ్యకరంగా ప్రవర్తించాడు. నన్ను ఎక్కడ పడితే అక్కడ పట్టుకున్నాడు. అలాంటిది ఆయన ఓ అమ్మాయి తరఫున మాట్లాడుతున్నాడంటే కామెడీగా ఉంది. నాతో అతను ఎంత నీచంగా మాట్లాడేవాడో, నన్ను నోటికొచ్చినట్లు ఎలా తిట్టాడో చెప్తే మీరు షాకవుతారు. కానీ ఆ నీచమైన కామెంట్స్‌ గురించి నేను నా నోటితో చెప్పలేను. అతని ప్రవర్తన భరించలేక నేను సీరియల్ నిర్మాతకు ఫిర్యాదు చేశాను. ఈ విషయం సిద్ధార్థ్‌కు తెలిసి సెట్స్‌లో నానా హంగామా చేశాడు. నేను సెట్‌లోకి అడుగుపెట్టగానే నోటి కొచ్చినట్లు తిట్టి నాపై చిందులేశాడు. నా శరీరం గురించి అసహ్యంగా మాట్లాడాడు. ఇప్పుడేమో బిగ్ బాస్‌ షోలో అతనో మహా పురుషుడైనట్లు పోజు కొడుతున్నాడు’ ‘ఓసారి ఓ సన్నివేశం తెరకెక్కిస్తుంటే నా కాళ్లు పట్టుకుని నొక్కాడు. చెప్పుకోలేని చోట ముట్టుకున్నాడు. నాకు చాలా చిరాకు అనిపించింది. దాంతో ఆ సీన్ సరిగ్గా చేయలేకపోయాను. దాంతో డైరెక్టర్‌తో పాటు సెట్‌లో ఉన్నవారంతా నన్ను తిట్టారు. సిద్ధార్థ్ నన్ను ఎలా పడితే అలా పట్టుకుంటున్నాడని, దాని వల్ల సీన్‌పై ఫోకస్ చేయలేకపోతున్నానని ఎవ్వరితో చెప్పుకోలేని పరిస్థితి. అసలు మా ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ కూడా లేదు. కానీ నేను అతనికి బాగా తెలిసినట్లు మీద చేతులేసి మాట్లాడేవాడు. ‘బాలికా వధు’ నా తొలి సీరియల్ కాబట్టి ఎవ్వరికీ చెప్పొద్దు అనుకున్నాను. కానీ అతని అసభ్య ప్రవర్తన రోజురోజుకీ మితిమీరిపోతుంటే ప్రొడ్యూసర్‌కి ఫిర్యాదు చేశాను’ అని వెల్లడించారు షీతల్. ‘బాలికా వధు’ సీరియల్ తెలుగులో ‘చిన్నారి పెళ్లి కూతురు’ టైటిల్‌తో ప్రసారమైంది. ఈ సీరియల్‌కు మంచి పాపులారిటీ దక్కింది. ఇందులో చిన్నారి పెళ్లి కూతురు పాత్రలో నటించిన అవికా గోర్ ఇప్పుడు మంచి హీరోయిన్‌గా ఎదిగి గుర్తింపు తెచ్చుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31Kvuho
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...