Saturday, 5 October 2019

నా మాజీ ప్రియుడు టార్చర్ చేశాడు, పెళ్లి జరిగుంటే.. : నటి

బాలీవుడ్‌ నటీమణుల్లో ఒక్కొక్కరు తాము ప్రేమలో ఎదుర్కొన్న సంఘటనల గురించి బయటపెడుతున్నారు. ఇటీవల నటి టీనా దత్తా తన మాజీ ప్రియుడు పెట్టిన టార్చర్ గురించి వెల్లడించారు. తాజాగా నటి తన బాధను వివరించారు. సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్‌బాస్‌లో కోయనా ఈ విషయాలు వెల్లడించారు. కెరీర్ పరంగా అంతంత మాత్రంగానే ఉన్న కోయనాకు సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్‌లో అవకాశం ఇచ్చాడు. ఈ సందర్భంగా కంటెస్టెంట్స్ కోయనా బాయ్‌ఫ్రెండ్ గురించి ప్రశ్నించారు. దీనిపై కోయనా స్పందిస్తూ.. ‘కొన్నేళ్ల క్రితం టర్కీకి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించాను. కానీ అతను నన్ను టార్చర్ చేశాడు. నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్లకూడదు అనేవాడు. ఓసారి నేను షూటింగ్ కోసం బయటికి వెళుతున్నానని తెలిసి నన్ను బాత్రూమ్‌లో పెట్టి లాక్ చేశాడు. వాళ్ల అమ్మానాన్నలను కలవాలని గొడవ చేసేవాడు. పెళ్లి చేసుకుని ఏం చేయాలనుకుంటున్నావ్ అని అడిగితే.. టర్కీకి తీసుకెళ్లిపోయి నా పాస్‌పోర్ట్ కాల్చేస్తానని అన్నాడు. అప్పుడు నేను ఇంకెప్పుడూ భారత్‌కు వచ్చే అవకాశం ఉండదని బెదిరించాడు. దాంతో అతనితో వేగలేను అనిపించింది. బ్రేకప్ చెప్పేసి వచ్చేశాను. అతన్ని చూశాక నాకు ప్రేమించాలంటేనే భయం వేసింది. అందుకే ఇప్పటివరకు ఎవ్వర్నీ ప్రేమించలేదు’ అని వెల్లడించారు. 2004లో కోయనా మిస్ ఇండియా ఇంటర్ కాంటినెంటల్ టైటిల్‌ను గెలుచుకున్నారు. ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇందుకు కారణం ఆమె ముక్కుకు చేయించుకున్న సర్జరీ వికటించడమే. సినిమాల్లోకి రానంతవరకు కోయనా చూడటానికి బాగానే ఉండేవారు. కానీ ముక్కు సన్నగా కనిపించాలని ఆమె సర్జరీ చేయించుకున్నారు. దాంతో అది కాస్తా ఎలాంటి రూపం లేకుండా అయిపోయింది. 2004లో వచ్చిన ‘ముసాఫిర్’ సినిమాలోని ‘ఓ సాకి సాకి’ అనే ఐటెం పాటతో కోయనా మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఆ పాటను ఇటీవల రీమిక్స్ చేశారు. అప్పట్లో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసిన తన పాటను ఇంత త్వరగా రీమిక్స్ చేసి ఉండాల్సింది కాదని కోయనా అభిప్రాయపడ్డారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30JFruZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...