Saturday, 26 October 2019

దీపావళి సంబరాల్లో ధరమ్ తేజ్, రాశీ ఖన్నా

చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ప్రతి రోజూ పండగే’. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, వంద కోట్ల క్లబ్ లో చేరిన గీత గోవిందం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అందం అభినయంతో మెప్పిస్తున్న గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. దీపావళి పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ తెలుగు ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సాయి తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లిమ్స్ ఆఫ్ ప్రతిరోజూ పండగే కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ వీడియోలో సాయి ధరమ్ తేజ్, సత్యరాజ్ మధ్య వచ్చే సన్నివేషాలు ముచ్చటగా ఉన్నాయి. తాత & మనవడు మధ్య రిలేషన్ ను ఈ సినిమాలో అందంగా చూపించడం జరుగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. సాయి తేజ్ ను కొత్త రకమైన పాత్ర చిత్రణతో, న్యూ లుక్ లో చూపించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కుటుంబ బంధాల్ని, విలువల్ని ఎమోషనల్‌గా చిత్రీకరించనున్నారు. మారుతి చిత్రాల్లో సహజంగా కనిపించే ఎంటర్ టైన్ మెంట్ ఇందులో రెండు రెట్లు ఎక్కువగానే ఉండబోతుంది. GA2UV పిక్చర్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మిస్తున్నారు. సాయితేజ్, మారుతి కాంబినేష‌న్ లో తెర‌కెక్కనున్న ప్రతిరోజూ పండుగే చిత్రంపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. సుప్రీమ్ హీరో సాయి తేజ్, ఢిల్లీ బ్యూటీ రాశీ ఖ‌న్నా సుప్రీమ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత మరోసారి కలిసి నటిస్తున్నారు. క‌ట్టప్పగా తెలుగు ప్రేక్షకుల‌కి మరింత చేరువైన ప్రముఖ న‌టులు స‌త్య‌రాజ్ క్యారెక్టర్ ని ఈ సినిమా ద‌ర్శకుడు మారుతి ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అలానే ఈ సినిమాలో న‌టిస్తున్న మ‌రో న‌టుడు రావు ర‌మేశ్ పాత్ర కూడా హైలెట్‌గా ఉండబోతోంది. డిసెంబర్ 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JncvmX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...