Thursday, 24 October 2019

వర్మ.. పవన్‌ కళ్యాణ్‌ని మాత్రం వదలటం లేదుగా..!

కొంతమంది వ్యక్తుల మధ్య వైరం ఎందుకు, ఎప్పుడు, ఎలా మొదలైందో ఎవరికీ అర్థం కాదు. కానీ వారి మధ్య జరిగే పరిణామాలు మాత్రం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అలాంటి అరుదైన జోడినే , పవర్‌ స్టార్ . పవన్‌ సినిమాల్లో ఉన్నప్పటి నుంచే వర్మ విమర్శలు మొదలయ్యాయి. పవన్‌ కళ్యాణ్ వీరాభిమానని అంటూనే పవన్‌పై దారుణమైన విమర్శలు ఎన్నో చేశాడు వర్మ. ముఖ్యంగా అజ్ఞాతవాసి సినిమా సమయంలో వర్మ చేసి ట్వీట్లు పవన్‌ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. అంతేకాదు పవన్‌ అభిమానులతో ప్రత్యక్షపోరాటానికి దిగిన కత్తి మహేష్‌కు కూడా వర్మ తన మద్దతు తెలపటం పవన్‌ అభిమానుల కోపానికి కారణమైంది. Also Read: పవన్‌ పొలిటికల్‌ ఎంట్రీ తరువాత కూడా వర్మ తన ట్వీట్ దాడి కొనసాగించాడు. పవన్‌ రాజకీయ ప్రసంగాలను, స్టేట్‌మెంట్స్‌ను విమర్శిస్తూ చాలా ట్వీట్లే చేశాడు. తాజాగా పవన్‌పై తనదైన స్టైల్‌లో మరో అస్త్రాన్ని ప్రయోగించాడు వర్మ. ఇటీవల లక్ష్మీస్‌ ఎన్టీఆర్ సినిమాతో హిట్ అందుకున్న వర్మ తాజాగా మరో పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌ సినిమాను రూపొందిస్తున్నాడు. Also Read: ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రస్తుత రాజకీయాల్లోని కీలక నాయకులను తెర మీద చూపించనున్నాడు వర్మ. అయితే తన సినిమాలో పాత్రలో నిజజీవితంలో ఎవరినైనా పోలిఉన్నట్టుగా అనిపిస్తే అది యాధృచ్చిమే అంటూ చెపుతున్నా.. వర్మ అసలు ఉద్దేశం ఏంటో అందరికీ తెలిసిందే. ఈ నెల 27న ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించిన వర్మ వరుసగా పోస్టర్‌లను రిలీజ్ చేస్తున్నాడు. ఈ పోస్టర్లలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుతో పాటు పవన్‌ కళ్యాణ్, కేఏ పాల్‌, లోకేష్‌ బాబు కూడా ఈ సినిమాలో ఉంటారని హింట్‌ ఇచ్చాడు. Also Read: అయితే తాజాగా సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ స్టిల్‌ను రిలీజ్ చేశాడు. ఓ వ్యక్తి పొలిటికల్‌ మీటింగ్‌లో ఐటమ్‌ గర్ల్స్‌ లాంటి ఇంగ్లీష్ అమ్మాయిలతో కలిసి సందడి చేస్తున్న స్టిల్‌ను రిలీజ్‌ చేశాడు వర్మ. ఈ ఫొటో చూసిన ఎవరికైన ఆ ఫొటో ఉన్న వ్యక్తి ఎవరన్నది ఇట్టే అర్థమైపోతుంది. పవన్‌ స్థాపించిన జనసేన పార్టీ జెండాలను పోలిన జెండాలతో పాటు పవన్‌ను పోలిన వ్యక్తి అమ్మాయిలతో కలిసి సందడి చేస్తున్నట్టుగా ఉన్న ఫోటో మరోసారి ట్విటర్‌నే షేక్‌ చేస్తుంది. మరి స్టిల్‌పై పవన్‌ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32PAX84
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...