టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు బాలీవుడ్‌లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తన గురువు రామ్ గోపాల్ వర్మ కోరిక మేరకు బాలీవుడ్‌లో బుడ్డా హోగా తేరా బాప్ సినిమాను తెరకెక్కించాడు పూరి. అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించటమే కాదు అమితాబ్ కెరీర్‌లో మరో మైల్ స్టోన్‌గా నిలిచిపోయింది. ఈ సినిమా సక్సెస్‌తో బాలీవుడ్ స్టార్ హీరో దృష్టిలో పడ్డాడు సల్మాన్. పూరి జగన్నాథ్, మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ పోకిరి. ఈ సినిమాను వాంటెడ్ పేరుతో ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్‌లో రీమేక్ చేశాడు సల్మాన్. ఒక రకంగా వాంటెడ్‌తో సల్మాన్ కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడనే చెప్పాలి. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో వరుసగా రీమేక్ సినిమాలు చేస్తూ భారీ విజయాలను అందుకున్నాడు సల్మాన్. Also Read: అప్పటి నుంచి సల్మాన్ సౌత్ టెక్నీషియన్స్‌తో కలిసి పనిచేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. ఇటీవల ప్రమోషన్ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సల్మాన్. నేను టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాను అన్నాడు. అంతేకాదు త్వరలోనే ప్రభుదేవాతో కలిసి హైదరాబాద్ వచ్చి పూరితో సినిమా విషయంలో చర్చలు జరుపుతానని వెల్లడించాడు. బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సూపర్ స్టార్ తమ అభిమాన దర్శకుడితో సినిమా చేయాలనుంది అనటంతో పూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే సల్మాన్ డైరెక్టర్‌గా ఓపెన్ ఆఫర్ ఇచ్చినా పూరి మాత్రం ఇంత వరకు ఆ ఆఫర్‌పై స్పందించలేదు. Also Read: ఇటీవల రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ తెరకెక్కించిన పూరి లాంగ్ గ్యాప్ తరువాత ఓ సూపర్ హిట్ అందుకున్నాడు. అదే జోష్‌లో టాలీవుడ్ సెన్సేషనల్ హీరోగా విజయ్ దేవరకొండతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. ఫైటర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది. సల్మాన్ ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న దబాంగ్ 3 సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ నెలారున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఇటీవల ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ohvPdX
v
No comments:
Post a Comment