Friday, 25 October 2019

నిన్నగాక మొన్నొచ్చి.. అందంతో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ

ఎలాంటి సీన బ్యాక్‌గ్రౌండ్ లేదు. బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి, సీరియల్స్‌లో నటించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది . 23 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టేసింది. అయితే తొలి సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది. కానీ తారాకు అందానికి, గ్లామర్‌కి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు ‘మర్జావా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో తారా మూగ యువతి పాత్రలో నటించింది. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాల సంగతి అటుంచితే.. తన ఫ్యాషన్, స్టైల్‌‌తో తారా కుర్రాకారు గుండెల్ని పిండేస్తోంది. తారా తరచూ పార్టీలకు, ఈవెంట్లకు వెళుతుంటుంది. ఇలాంటి వేడుకలకు ఆమె వేసుకొచ్చే దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఇటీవల బాలీవుడ్ నటి మలైకా అరోరా ఖాన తన 46వ బర్త్‌డే జరుపుకుంది. బర్త్‌డే పార్టీకి తారా కూడా వచ్చింది. ఆమె వేసుకున్న క్రాప్ టాప్ చూస్తే మతిపోవాల్సిందే. కేవలం రొమ్ములు మాత్రమే కవర్ చేసే ఈ టాప్ ఇప్పుడు ట్రెండీ అయిపోయింది. ఇటీవల గోవా బ్యూటీ ఇలియానా తన సినిమా ప్రమోషన్స్ కోసం అలాంటి టాప్‌నే వేసుకొచ్చింది. దాంతో తారాను చూసి అందరూ ఫ్యాషన్‌ని ఫాలో అయిపోతున్నారని నెటిజన్లు అంటున్నారు. తారా ఇన్‌స్టాగ్రామ్‌కు 20 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె పోస్ట్ చేసే ఫొటోలకు విపరీతమైన స్పందన వస్తుంటుంది. ఇక అబ్బాయిలైతే చెప్పనక్కర్లేదు. ఏకంగా నన్ను పెళ్లి చేసుకుంటావా? అని తారాను అడిగేస్తు్న్నారు. ఇక అమ్మాయిలైతే మీలాగా అందంగా మెరిసిపోవాలంటే ఏం చేయాలో మాకూ చెప్పండి అని అడుగుతున్నారు. ఒకప్పుడు సోషల్ మీడియాలో సినిమాలతోనే పాపులర్ అయ్యేవారు సెలబ్రిటీలు. వారు చేసే సినిమాలను బట్టే ఫాలోయింగ్ పెరుగుతూ ఉండేది. ఇప్పుడు అలా కాదు. సినిమాలు చేసినా చేయకపోయినా, హిట్ అయినా అవ్వకపోయినా, నటన వచ్చిన రాకపోయినా వారి ఫిగర్‌, అందానికి పడిపోయే ఫాలోవర్సే ఎక్కువ మంది ఉన్నారు. ఇందుకు ఉదాహరణ జాక్వెలీన్ ఫెర్నాండెజ్, దిషా పటానీ, తారా సుతారియానే. ఓరకంగా ఇది వీళ్లకి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో పాపులర్ అవడం వల్ల అవకాశాలు వారినే వెతుక్కుంటూ వస్తాయి. ఒకవేళ సినిమాలు లేకపోయినా యాడ్ ఫిలింస్ చేసుకుంటూ బతికేయొచ్చు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NcSJM0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...