Wednesday, 2 October 2019

సినిమా సూపర్ అంటూ మాజీ భార్య కితాబు.. ఇంతకంటే ఏం కావాలి

బాలీవుడ్ గ్రీక్‌గాడ్ హృతిక్ రోషన్.. తన భార్య సుసాన్నే ఖాన్‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లల కోసం అప్పుడప్పుడూ కలుసుకుంటూ ఉంటారు. సాధారణంగా భార్య, భర్త విడాకులు తీసుకుంటే వారి మధ్య అస్సలు మాటలు ఉండవు. అసలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడరు. కానీ హృతిక్ దంపతులు అలా కాదు. వారి మధ్య ఏం జరిగిందో ఎందుకు విడిపోయారు ఎవ్వరికీ తెలీదు. కానీ వారు విడిపోయినా ఒకరంటే ఒకరికి ఎంతో నమ్మకం, గౌరవం. సుసాన్నేకి తన మాజీ భర్త అంటే ఎంత నమ్మకం అంటే.. తనను మోసం చేశాడని హృతిక్‌పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆరోపించినా.. తన భర్త అలాంటివాడు కాదని మొదటి నుంచీ హృతిక్‌ను వెనకేసుకొచ్చారు సుసాన్నే. తాజాగా ఆయన నటించిన ‘వార్’ సినిమా గురించి పాజిటివ్‌గా స్పందించారు. మంగళవారం ముంబయిలో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. ఈ షోను సుసాన్నే కూడా చూశాను. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తన రివ్యూను పంచుకున్నారు సుసాన్నే. ‘వార్ సినిమాలో ఇద్దరు గార్జియస్ అబ్బాయిల్ని మీరు చూసి ఎంజాయ్ చేస్తారు. ఇద్దరూ సూపర్‌గా నటించారు’ అని పేర్కొన్నారు. సుసాన్నే మాత్రమే కాదు.. టైగర్ ష్రాఫ్ ప్రేయసి దిశా పటానీ కూడా సినిమాను ఆకాశానికెత్తేస్తున్నారు. ‘మిమ్మల్నిద్దరినీ ఒకే ఫ్రేంలో చూడటం ఓ ట్రీట్‌లాంటిది. మీరిద్దరూ బెస్ట్ కపుల్’ అంటూ కామెంట్ పెట్టారు. దిశా చెప్పింది నిజమే. బాలీవుడ్‌లో యాక్షన్ సూపర్ స్టార్స్ ఎవరన్నా ఉన్నారంటే అది హృతిక్, టైగర్ మాత్రమే. వీరికి యాక్షన్ పరంగా ఉన్న పాపులారిటీ చూసి దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ‘వార్’ సినిమాను తెరకెక్కించారు. ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి ప్రతిష్ఠాత్మక సినిమాతో పాటు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ అందుకుంటోంది. సినిమా బ్లాక్ బస్టర్, రూ.300 కోట్ల వసూళ్లు రాబడుతుందంటూ నెటిజన్లు తమ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. తొలిరోజే ఈ సినిమా కేవలం హిందీలో రూ.45 కోట్ల వసూళ్లు రాబడుతుందని ఎప్పటినుంచో సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ‘సైరా’తో పోలిస్తే ‘వార్’ బడ్జెట్ తక్కువే. కానీ హైప్ పరంగా మాత్రం రెండు సినిమాలపై భారీగా అంచాలు ఏర్పడ్డాయి. ‘సైరా’ సినిమా ‘బాస్ బస్టర్’ అని రామ్ చరణ్ ప్రకటించేశారు. ఇక వార్ సినిమా ఎలా ఉందో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2oqRm3w
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...