Sunday, 6 October 2019

20 ఏళ్ల తర్వాత.. అదే బికినీలో.. అంతే సెక్సీగా..

పెళ్లై పిల్లలు పుట్టాక సాధారణంగానే లావైపోతారు. ఆ తర్వాత మళ్లీ ఎలా ఒరిజినల్ వెయిట్‌కు తగ్గామన్నది ఎంతో ముఖ్యం. కొందరైతే లావైతే అయ్యాం అని ఊరుకుంటూ ఉంటారు. మరికొందరు జిమ్, యోగా వంటివి చేసి ప్రెగ్నెన్సీ బరువును తగ్గించుకోవాలనుకుంటారు. ఈ విషయంలో నటీమణులకు శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. ఇందుకు కరీనా కపూర్, శిల్పా శెట్టి, జెనీలియా, మలైకా అరోరాలే ఉదాహరణ. అయితే 20 ఏళ్లుగా ఒకేలా ఫిగర్‌ని మెయింటైన్ చేయడమంటే కష్టమే. ఇందుకు సమయానికి సరైన ఫుడ్, వ్యాయామం ఎంతో అవసరం. కానీ నాలుగు పదుల వయసులోనూ అంతే సెక్సీగా ఉన్నారు బాలీవుడ్ నటి . ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను పోస్స్ చేశారు. 1999లో మాల్దీవ్స్‌లో బికినీ వేసుకుని దిగిన ఫొటోను. ఇటీవల అదే ప్రదేశంలో అదే బికినీ వేసుకుని దిగిన ఫొటోను జత చేసి ఇన్‌స్టా్గ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘20 ఏళ్ల త్వాత మళ్లీ మాల్దీవ్స్‌కి వచ్చాను. ఇప్పటికీ నా మార్క్స్ అండ్ స్పెన్సర్ బికినీ ఏమాత్రం పాడవలేదు’ అని క్యాప్షన్‌లో పేర్కొన్నారు. ఈ ఫొటో చూసి అటు నెటిజన్లకు, ఇటు సినీ ప్రముఖులకు దిమ్మ తిరిగింది. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి ఆమెలో ఏ మార్పూ లేదు. ఇప్పటికీ అంతే సెక్సీగా, అందంగా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎందరో యువతులకు ఫిట్‌నెస్ పరంగా గుల్ పనాగ్ స్ఫూర్తిదాయకం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. గుల్ పనాగ్‌ వయసు 20 ఏళ్ల క్రితమే పెరగడం ఆగిపోయిందంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె వయసు 40. ఓ పిల్లాడికి తల్లి. అయితే ఆమె బాలీవుడ్ కెరీర్ అంత సక్సెస్‌ఫుల్‌గా లేదు. 2003లో ధూప్ అనే సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన గుల్‌కు చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. ఆమె ఎంత ఫిట్‌గా ఉన్నా 40 ఏళ్ల వయసులో తల్లి పాత్రలు, అక్క పాత్రలు మాత్రమే వస్తాయి. అందుకే ఆమె రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నారు. 2014లో తన స్వస్థలం అయిన చండీగఢ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ojIyg8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...