ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి శత్రువులా? 151 స్థానాల్లో విజయదుందిభి మోగించిన వైసీపీ అధినేతను ఢీ కొట్టలేక ఆయన శత్రువులు కుట్రలు పన్నుతున్నారట. అంతే కాదు.. శత్రువుల కొత్త కోరలకు పదును పెడుతున్నారట.. అందుకే గారూ బీ అలర్ట్.. వాళ్ల ఆలోచన పూర్తయ్యే లోపు మనమే ముందే నరికేయాలి అంటూ ఆంధ్రప్రదేశ్ సీఎంను అలర్ట్ చేస్తుంది వివాదాస్పద నటి . అదేంటి? ఈమెకు ఎలా తెలుసు? అసలు జగన్ శత్రువులు ఎవరు? పదును పెట్టడం ఏంటి? వాళ్లను నరికేయండి ఏంటబ్బా.. మరీ ఇంత వయొలెన్స్ ఎందుకో శ్రీరెడ్డి చెప్పలేదు కాని.. జగన్‌కి జాగ్రత్తలు చెబుతూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. ఎన్నికల ముందు నుండి జగన్‌ను ఆయన ప్రభుత్వాన్ని సమర్ధిస్తూవస్తున్న శ్రీరెడ్డి.. జగన్‌కు కుట్రలు చేస్తున్నారంటూ మండిపడుతోంది. ఒక్క జగన్ పైనే కాదు.. అప్పట్లో లోకేష్ బాబు, చంద్రబాబులపై కూడా పాజిటివ్ పోస్ట్‌లు పెట్టింది. మొత్తానికి ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన ఈ పొలిటికల్ పోస్ట్ వైరల్ అవుతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZAZBMf
v
No comments:
Post a Comment