Friday, 27 September 2019

బన్నీ V/S మహేష్.. ఎవ్వరూ తగ్గట్లేదు?

సంక్రాంతికి రెండు మూడు సినిమాలు రిలీజ్ అవుతుండడం అనేది కామన్. రెండు సినిమాలు రిలీజ్ అయినా, మూడు సినిమాలు రిలీజ్ అయినా కూడా వాటి మధ్య కాస్త గ్యాప్ ఉంటే పోటీ అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఏ సినిమాలో కంటెంట్ బావుంటే, ఏ సినిమాకి టాక్ బావుంటే ఆ సినిమానే బాక్స్ ఆఫీస్ దగ్గర రూల్ చేస్తుంది.అయితే ఈసారి పోటీ మాత్రం కాస్త విచిత్రంగా ఉంది. రజినీ కాంత్ డబ్బింగ్ సినిమా దర్బార్ ని మినహాయిస్తే మూడు తెలుగు సినిమాలు సంక్రాంతికి లైన్ లో ఉన్నాయి. అయితే వాటిలో కళ్యాణ్ రామ్ సినిమా ఎంతమంచివాడవురా కూడా పేరుకి తగ్గట్టే ఎలాంటి ప్రాబ్లెమ్ లేకుండా అందరికంటే లాస్ట్ లో వచ్చేలా జనవరి 15 రిలీజ్ అని ఫిక్సయిపోయారు. Also Read: నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతికి వస్తుంది అని ముందే అనౌన్స్ చేసి మరీ షూటింగ్ కి వెళ్ళారు. అలాగే అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కూడా సంక్రాంతికి ఫిక్స్ అయ్యింది. అలాగే ఆ సినిమా ముందే జనవరి 12 న వస్తున్నట్టు డేట్ కూడా ఇచ్చేసారు. అయితే ఆ సినిమా ముందు రోజు మాత్రమే సరిలేరు నీకెవ్వరు రిలీజ్ చేసుకోవడానికి అనువుగా ఉంది.అయితే మహేష్ సినిమా ఆ రోజుకి వస్తే అల..వైకుంఠాపురాన్ని కాస్త వెనక్కి వెళ్ళి జనవరి 14 కి రావాల్సిందింగా రిక్వెస్ట్ చేశారట. కానీ వాళ్ళు దానికి నో చెప్పారు అని టాక్. Also Read: దీంతో జనవరి 11 అనే డేట్ కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వని మహేష్ బాబు కూడా జనవరి 12 కే రావాలని పంతం పట్టినట్టుగా తెలుస్తుంది. అంటే ఆదివారం పూట ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్. అదేకనుక జరిగితే థియేటర్స్ దగ్గర మామూలు కోలాహలం ఉండదు. కానీ ఈ వార్ రెండు సినిమాలకు కూడా నష్టం కలిగిస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం ఎవ్వరూ తగ్గట్లేదు. ఒక పక్క తన సినిమా అదిరిపోతుంది అని మహేష్, నా సినిమాకి తిరుగులేదు అని బన్నీ ఇద్దరూ కూడా ఎవరి మటుకు వాళ్ళు ధీమాగా ఉన్నారు.నిజానికి ముందు డేట్ వేసుకుంది అల..వైకుంఠపురములో కాబట్టి ఆ సినిమా డేట్ కాకుండా జనవరి 14 న మహేష్ రావచ్చు.కానీ వీకెండ్ కలెక్షన్స్ పూర్తిగా వదులుకోవాల్సి వస్తుంది అని ఆ ఆలోచన చెయ్యట్లేదు. Also Read: ఈ క్లాష్ వల్ల నష్టపోయేది బయ్యర్స్. అందుకే ఈ సినిమాల అమ్మకం మొదలయ్యి వాళ్ళు లైన్ లోకి వస్తే తప్ప ఎవరు ఏ డేట్ కి వస్తారు అనే విషయంపై క్లారిటీ రాదు .ఇలాంటాప్పుడే పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలోని 'ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు' అనే డైలాగ్ లోని గొప్పతనం రియాలిటీలో కనిపిస్తుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2m9B26E
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...