Thursday, 26 September 2019

Sye Raa: ముదిరిన ‘సైరా’ వైరం.. కోర్టు తీర్పుతో భవితవ్యం

సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అని అనౌన్స్ అయ్యింది. ఆ మేరకు ఒక రేంజ్‌లో సైరా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. రామ్ చరణ్ చాలా యాక్టివ్‌గా ఆ పబ్లిసిటీని దగ్గరుండి మరీ చూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్‌కి అడ్డంకులు మాత్రం తొలగిపోలేదు.సైరా సినిమా కథకి తాము డబ్బులు చెల్లిస్తామని చెప్పబట్టే ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబందించిన విషయాలు తాము చెప్పామని, అలాగే రియల్ లొకేషన్స్‌లో షూటింగ్ కూడా చేసుకొనిచ్చామని చెప్పుకొస్తున్నారు కోర్ట్ లో కేస్ వేసిన. ఇదే విషయాన్ని వాళ్ళు తెలంగాణ హై కోర్ట్‌లో సైతం వెల్లడించారు. దీంతో ఈ సినిమా విడుదలపై సందిగ్థత నెలకొంది. సెన్సార్ విషయంలో గందరగోళం:సైరా సినిమాకి సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిపోయాయి అని ఎప్పుడో ప్రకటించారు. కానీ ఈ రోజు మాత్రం కోర్టులో ఆ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేదు అని ప్రకటించారు. కానీ కొద్దిసేపటిక్రితమే ఆ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది అని ఆ సినిమా PRO లు సెన్సార్ సర్టిఫికేషన్ స్క్రీన్ షాట్‌ని షేర్ చేశారు. అయితే ఆ సరిఫ్టికేట్‌పై కూడా ఈ రోజు ఇచ్చినట్టు ఉంది. మరి అలాంటప్పుడు మరి రెండు రోజుల ముందే యూనిట్ ఎలా సెన్సార్ అయిపొయింది అని చెప్పింది?. కోర్ట్‌లో సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేదు అని ఆ బోర్డు సభ్యులు ఎలా చెప్పారు?. కోర్టులో సెన్సార్ బోర్డు సోమవారం తమ నిర్ణయం చెబుతాం అని చెప్పినప్పుడు ఈలోగా సెన్సార్ సర్టిఫికెట్ ఎక్కడినుడి వచ్చింది?, 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా చుట్టూ ఇంత గందరగోళం ఏంటి?. ఇది అసలు బయోపిక్ కాదు: సురేందర్ రెడ్డి సైరా సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర అని, ఆయన జీవిత చరిత్ర అందరికి తెలియాలి అని ఈ సినిమా తీసాం అని ముందు నుండి చెబుతున్నారు ఈ సినిమా టీమ్. కానీ ఇప్పుడు ఈ‌సినిమా కథపై విచారణ సందర్భంగా అసలు ఇది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ కాదు అని, స్వయంగా రాసుకున్న కథ అని చెప్పుకొచ్చారు ఈ సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డి. మరి అలాంటాప్పుడు వేదికపై ఈ సినిమా నిజంగా జరిగిన కథ అని, సురేందర్ రెడ్డి స్వయంగా కర్నూల్ వెళ్లి అక్కడ మరిన్ని వివరాలు సేకరించి ఈ సినిమా కథ రాసారు అని ఎలా చెప్పారు?. Also Read: నిన్నటివరకు క్లియర్ గా ఉంది, ఎలాంటి ఆటంకాలు లేకుండా రిలీజ్ అవుతుంది అనుకున్న సైరా పై ఇప్పుడు అంతా కన్ఫ్యూషనే. అసలు ఈ సినిమా ప్రచారంలో చెప్పింది నిజామా?, లేక కోర్ట్‌కి చెప్పింది నిజామా?, అసలు సెన్సార్ బోర్డు సభ్యులు ఏం మాట్లాడుతున్నారు?, సినిమా టీమ్ ఏం ప్రచారం చేస్తున్నారు?..ఇలా అంతా కూడా ఒక పజిల్‌లా ఉంది. ఈ కేసుపై విచారణ సోమవారానికి వాయిదా పడడంతో బుధవారం ఈ సినిమా రిలీజ్ అనేది కూడ ఇప్పుడు కాస్త అనుమానంగానే ఉంది. ఈ కన్ఫ్యూషన్ అంతా ఎప్పటికి క్లియర్ అవుతుంది?...సైరా ఎలా రిలీజ్ అవుతుంది అనేది చూడాలి


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2m1KzfF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...