Thursday, 5 September 2019

Sri Reddy: ఆ జూ.ఆర్టిస్ట్‌ని పవనే ఆదుకోవాలా? ఎందుకమ్మీ ఆ ఫైరింగ్!

ప్రాణం పోయే పేషెంట్ దగ్గరకు అంబులెన్స్ అయినా కాస్త లేట్‌గా వస్తుందేమో కాని.. పవన్ పేరు వినబడితే శ్రీరెడ్డి ఎంట్రీ మాత్రం అస్సలు లేటే ఉండదు. టాలీవుడ్ క్యాస్టింగ్ ఉదంతంతో ఇండస్ట్రీని హడలెత్తించిన శ్రీరెడ్డి.. పవన్ కళ్యాణ్‌ పేరు వినబడితే చాలు అంతెత్తున లేస్తుంది. అవకాశాల పేరుతో తనను వాడుకుని వదిలేశారంటూ బడా నిర్మాతల కొడుకుల బండారాన్ని రోడ్డుకి లాగిన శ్రీరెడ్డి.. ఫిల్మ్ ఛాంబర్ వద్ద అర్ధనగ్న ప్రదర్శనతో అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఆమె బాటలోనే అనే జూనియర్ ఆర్టిస్ట్ బుధవారం నాడు ఫిల్మ్ ఛాంబర్ వద్ద హల్ చేసింది. గొలుసులతో తనను తాను బంధించుకుని తనకు న్యాయం చేయాలని నిరసనకు దిగింది. నిర్మాత బన్నీ వాసు.. గీతా ఆర్ట్స్‌లో ఆఫర్స్ ఇప్పిస్తానని తనను మోసం చేశాడంటూ తీవ్ర ఆరోపణలు చేస్తూ నిరసన తెలిపింది. Read Also: తరువాత ఆమెను అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. ఈ తరుణంలో ఆమె జనసేన తరుపున యాక్టివ్ మెంబర్‌గా ఉండటంతో పవన్ కళ్యాణ్‌పైనా, జనసేన పైనా తప్పుడు కథనాలకు ప్రచారం చేశాయి కొన్ని ఛానల్స్. జనసేన పార్టీ వాళ్లు ఆమెను మోసం చేశారని అందుకే ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిందంటూ వరుస కథనాలను ప్రచారం చేశారు. వీటిని ఖండిస్తూ.. తనకు నిర్మాత బన్నీ వాసుతో మాత్రమే గొడవ ఉందని ఇందులో జనసేనకు, పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చింది సునీత. ఇక గీతా ఆర్ట్స్ వాళ్లు కూడా సునీత బోయ ఆరోపణలపై స్పందిస్తూ.. నోట్ విడుదల చేశారు. సునీత బోయ పేరును ప్రస్తావించకుండా. ఆమె తమపై తప్పుడు ఆరోపణలు చేసిందని.. వాటిలో వాస్తవం లేదనికొట్టిపారేశారు. ఇదిలా ఉంటే.. ఒకవైపు ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్‌కు జనసేనకు సంబంధమే లేదు.. నాకు జనసేన అంటే ప్రాణం.. అవసరమైతే జనసేన ఆఫీస్‌లో పనిమనిషిగానైనా ఉండిపోతా అని చెప్తునే ఉంది సునీత బోయ. అయితే ఇష్యూలోకి పవన్ కళ్యాణ్‌ని లాగుతూ తనదైన శైలిలో పోస్ట్ వదిలింది శ్రీరెడ్డి. ‘పవన్ కళ్యాణ్.. సునీతని పట్టించుకోడా? మా మీదికి కుక్కల్ని వదిలితే కర్మ తిరిగి మిమ్మల్నే కరుస్తుంది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. నిరసన తెలిపింది సునీత.. అన్యాయం చేశారని ఆరోపిస్తున్నది గీతా ఆర్ట్స్‌పై మధ్యలో పవన్ కళ్యాణ్, జనసేన ప్రస్తావన ఏందుకు అంటూ జనసైనికులు స్పందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34sS6Wb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...