Wednesday, 4 September 2019

Saaho: రాజమౌళి ముందే చెప్పాడు.. ప్రభాస్ వినలేదు

పెద్దల మాట పెడచెవిన పెట్టరాదు అని ఊరికే అనలేదు. అందుకు రెబెల్ స్టార్ ప్రభాసే ఉదాహరణ. అసలు విషయమేంటంటే.. ‘సాహో’ సినిమా రన్ టైం 150 నిమిషాలు ఉంది. ఒక తెలుగు సినిమా ఇంతటి నిడివి కలిగి ఉండటం ఇదే మొదటిసారేమో. ఇది సినిమాకు మైనస్ పాయింట్‌గా మారుతుందని దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి సాహో బృందానికి ఎప్పుడో చెప్పారట. సాహో సినిమా విడుదలకు ముందు రాజమౌళి స్పెషల్ స్క్రీనింగ్‌ చూశారు. రన్ టైం ఎక్కువగా ఉంది.. తగ్గిస్తే బాగుంటుందని ప్రభాస్‌కు సూచించారు. కానీ సినిమాకు అది అవసరమేనని ఆయన మాటల్ని పెడచెవిన పెట్టారు. అంతేకాదు.. ‘బాహుబలి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా చేసిన తర్వాత నేరుగా యాక్షన్ సినిమా చేస్తే ప్రేక్షకులకు రుచించదని, ఏదన్నా రొమాంటిక్ సినిమా చేస్తే బాగుంటుందని కూడా చెప్పారట. ప్రభాస్ మాత్రం సాహో తీసి తీరాలని పట్టుబట్టి కూర్చున్నారు. మరో విషయం ఏంటంటే.. ఏదన్నా ఒక మంచి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తే దాని గురించి రాజమౌళి కచ్చితంగా సోషల్ మీడియాలో చర్చిస్తారు. కానీ తనకు సోదరుడిలాంటివాడైన ప్రభాస్ నటించిన సినిమా గురించి మాత్రం రాజమౌళి ఎలాంటి ట్వీట్ చేయలేదు. ప్రభాస్ తన మాట విననందుకు రాజమౌళికి కోపం వచ్చిందని అందుకే సినిమాకు ప్రచారం కల్పించదలచుకోలేదని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ వివాదం కారణంగా మున్ముందు ప్రభాస్‌తో కలిసి రాజమౌళి సినిమా చేసేందుకు ముందుకు వస్తారా? అన్న చర్చ కూడా మొదలైంది. అయినా రాజమౌళి తనకు అంత నమ్మకస్తుడు అయినప్పుడు ప్రభాస్ ఆయన మాట ఎందుకు వినలేదు? సుజిత్‌పై నమ్మకంతోనా? లేక సినిమా ఎలాగో వసూళ్లు రాబడుతుందన్న ధీమాతోనా? సుజిత్ దర్శకత్వం వహించిన సాహో సినిమాలో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించారు. నీల్ నితిన్ ముఖేశ్ విలన్ పాత్రలో, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, ఎవ్లిన్ శర్మ సహాయ పాత్రల్లో నటించారు. ఏదైతేనేం.. సినిమాకు పెట్టిన బడ్జెట్ ఎటూ వచ్చేసింది కాబట్టి ప్రభాస్ ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా తన తదుపరి సినిమా చిత్రీకరణపై ఫోకస్ చేస్తున్నారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NKlPnT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...