Thursday, 26 September 2019

RIP Venu Madhav: వేణు మాధవ్‌ని 2 వేలు అప్పు అడిగా.. కాని: కోట శ్రీనివాస్ భావోద్వేగం

కమెడియన్ బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ కొనియాడారు విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు. వేణు మాధవ్ మరణం తనను కలచివేసిందంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు కోటా. వేణు మాధవ్‌లో ఐదారు కళలు ఉన్నాయి. తెలుగు సినిమా 75 సంవత్సరాల వేడుక జరిగినప్పుడు వేణు మాధవ్.. రామలింగయ్య గారి ముత్యాలు వస్తారా పాటకు నటించారు. స్వయంగా రామలింగయ్యగారే వచ్చినట్టు అనిపించింది. అంతగొప్పగా ఎమిటేట్ చేసేవారు. Read Also: వేణు మాధవ్‌ని 2 వేలు అడిగా.. ఒకసారి ఎయిర్ పోర్ట్‌లో ఏదో కొనుక్కోవల్సి వచ్చింది నాకు. రూ. 2 వేలు తక్కువ వచ్చాయి. వేణు మాధవ్‌ని ఓ రెండు వేలు కావాలి అని అడిగా. వెంటనే ఆయన తీసుకో బాబాయ్ అని ఇచ్చాడు. తరువాత అవి తిరిగి ఇవ్వడానికి చాలా ట్రై చేశా. కాని అతను నాకు వద్దు అన్నాడు. ఎందుకు అని అడిగితే.. ఓ మహానటుడు నాకు అప్పు ఉన్నాడు అని చెప్పుకోవడానికి ఉంటాదన్నాడు. ఆ రెండువేలు ఇప్పటి వరకూ తీసుకోలేదు. అంత మంచి మనిషి చిన్న వయసులో చనిపోవడం బాధాకరం. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అన్నారు .


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2lnfJhr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...