Friday, 6 September 2019

Ram Gopal Varma: బాబోయ్.. ఎవరీ ‘బాబు’? ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ షాకింగ్ పోస్టర్

మనిషి అన్నాక కాస్త కళా పోషణ ఉండాలి కాని.. మరీ వర్మకు ఉన్నంత కళా పోషణ ఉంటే కాస్త ప్రమాదమే. నవ్వేవారు నవ్వినా.. తిట్టే వారు తిట్టినా.. పొగిడేవాళ్లు పొగిడినా.. ఏడ్చేవాళ్లు ఏడ్చినా తన రూట్ మాత్రం మార్చుకోడు వర్మ. వివాదం అనే మాటలను ఇంటి పేరుగా మార్చుకుని వివాదాస్పద దర్శకుడిగా మారిన వర్మ తాజా చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’. ఎన్టీఆర్ బయోపిక్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో ఇండస్ట్రీలో పలు వివాదాలు రాజేసిన వర్మ.. ఇప్పుడు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే వివాదాస్పద చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రెండు కులాల మధ్య చిచ్చు పెడుతూ.. రెచ్చగొట్టేలా ఇప్పటికే టీజర్, ప్రోమో, సాంగ్‌లను వదలిపెట్టాడు. తాజాగా రేపు (సెప్టెంబర్ 10) ఉదయం 9.27 గంటలకు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటిస్తూ అచ్చుగుద్దినట్టుగా చంద్రబాబు పాత్రలో ఉన్న వ్యక్తి ఫొటోను షేర్ చేశారు. ఈ పాత్ర ఎవరిదో గెస్ చేయండి.. ఆ పాత్రలో ఓ కొత్త నటుడు నటిస్తున్నాడు అంటూ ఫొటోను షేర్ చేశారు. అయితే ఈ ఫొటోలో చంద్రబాబుని పోలిన వ్యక్తి విలన్ మాదిరి కనిపిస్తున్నారు. శాంపిల్ లుక్‌తోనే హీట్ పెంచేసిన వర్మ.. రేపటి మోషన్ పోస్టర్‌తో ఎలాంటి వివాదాన్ని రాజేస్తాడో ఈ వర్మ చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2POd4vv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...