Saturday, 28 September 2019

Puri Birthday: నచ్చిన పనికోసం చచ్చిపోండి: పూరీ బర్త్ డే మెసేజ్

ఇండస్ట్రీకి ఎంతో మంది దర్శకులు వస్తుంటారు.. పోతుంటారు.. కాని పూరీ లాంటి దర్శకులు అప్పుడప్పుడూ మాత్రమే పుడుతుంటారు. గొప్ప సినిమాలు తీశారని కాదు.. గొప్ప మనసు ఉంది కాబట్టే ఆయన గ్రేట్ డైరెక్టర్ అయ్యారు. స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్‌ హిట్లు ఇచ్చిన ఆయన ఒకప్పుడు అత్యధిక పారితోషికం తీసుకున్న డైరెక్టర్. అయితే కాలం కలిసి రాకపోవడంతో స్టార్ హీరోలు మెల్లగా సైడ్ అయ్యారు. చేతిలో కనీసం రూ. 50 వేలు లేని స్థితికి వచ్చేసినా.. పూరీ.. ఎవరి ముందూ చేయి చాచలేదు. తాను నమ్ముకున్న మెగా ఫోన్‌కి పదును పెట్టారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తిరిగి హిట్ కొట్టి తానేంటో నిరూపించుకున్నారు. నేడు బర్త్ డే సందర్భంగా.. అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు హీరోయిన్ చార్మి. ఈ సందర్భంగా సినిమాలు లేక ఖాళీగా ఉన్న ఓ 20 మంది డైరెక్టర్లు, కో డైరెక్టర్లు ఒక్కొక్కరికి 50 వేల చొప్పున సాయం చేయచేశారు. కష్టం విలువ తెలిసిన పూరీ మరోసారి ది గ్రేట్ డైరెక్టర్ అనిపించుకుని ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్.. గోవాలో విజయ్ దేవకొండ సినిమా స్క్రిప్ట్ పనిలో ఉండగా.. తన బర్త్ డే మెసేజ్‌ను చార్మి ద్వారా షేర్ చేశారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ‘మనం అందరం ఏదో సాధించాలని తపన పడుతుంటాం. అయితే కొంతమంది స్టార్స్ అవుతారు. మిగతా వాళ్లు కాలేరు. అంతే వాళ్లు సక్సెస్ అయినట్టు మిగతా వాళ్లు ఫెయిల్ అయినట్టు కాదు. నా అభిప్రాయం ప్రకారం నిజమైన సక్సెస్ ఏంటంటే.. నీకిష్టమైన పనికోసం కష్టమొచ్చినా.. నష్టమొచ్చినా దానికోసం చావడమే నిజమైన సక్సెస్. ఆ పని వల్ల పది రూపాయిలు రావచ్చు. కోటిరూపాయిలు రావచ్చు. ఇష్టమైన పనికోసం చావండి’ అంటూ చార్మీ ద్వారా మెసేజ్ పంపారు పూరీ జగన్నాథ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2mBTbdm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...