జనసేన అధినేత జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా జరుపుకొంటున్నారు. జనసేనానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం కురుస్తోంది. మన దేశంలో ట్విట్టర్ ట్రెండ్స్‌ను పవన్ ఫ్యాన్స్ సెట్ చేశారు. ఇదే సమయంలో పవర్ స్టార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆయన స్థాపించిన జనసేనకు తోచిన మొత్తంలో విరాళాలు అందిస్తున్నారు. తాజాగా ‘కొబ్బరి మట్ట’ టీమ్ జనసేన పార్టీకి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చింది మా టీం ఇచ్చిన మాట ప్రకారం నేను, సంపూర్ణేశ్ బాబు, ఉమా మహేశ్.. జనసేన పార్టీకి లక్ష రూపాయలు విరాళంగా అందజేశామని ‘కొబ్బరి మట్ట’ నిర్మాత సాయి రాజేశ్ ట్వీట్ చేశారు. జనసేన పార్టీ భీమిలి అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ సందీప్ పంచకర్లకు చెక్కును పంపించామని ఆయన తెలిపారు. తమ సినిమాను హిట్ చేసిన అందరు హీరోల అభిమానులకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మూవీకి మెగా బ్రదర్ నాగబాబు మద్దతు ప్రకటించారు. సంపూ మెగా ఫ్యాన్ అన్న నాగబాబు.. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నారు. ఈ మూవీ మూడు రోజుల్లోనే రూ.12 కోట్లు రాబట్టి సంచలనం క్రియేట్ చేసింది. కొబ్బరి మట్ట సినిమా హీరో సంపూర్ణేశ్ బాబు ఇటీవలే కేరళ వరద బాధితులను ఆదుకోవడం కోసం రూ.2 లక్షలు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఈ మొత్తాన్ని ఆయన అందజేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HEHTMR
v
No comments:
Post a Comment