Wednesday, 18 September 2019

IIFA Awards: సల్లూ భాయ్ స్టైలిష్ ఎంట్రీ.. వెంటపడిన కుక్క

ముంబయిలో బుధవారం రాత్రి జరిగిన ఐఫా (ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్) వేడుకలో ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. వేడుకకు ఎందరో బాలీవుడ్ నటీనటులు హాజరై సందడి చేశారు. అయితే బాలీవుడ్ సూపర్ స్టార్ నేవీ బ్లూ సూట్ ధరించి చాలా స్టైలిష్‌గా తయారై వేడుకకు హాజరయ్యారు. ఫొటోగ్రాఫర్లు పోజులిచ్చి లోపలికి వెళుతుండగా వెనక నుంచి ఓ కుక్క సల్మాన్ వెనకే వెళ్లిపోయింది. అది గమనించిన ఈవెంట్ నిర్వాహకులు దానిని పట్టుకుని బయట వదిలారు. ఆ సమయంలో రికార్డ్ అయిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. ‘ఆ కుక్క చాలా క్యూ్ట్‌గా ఉంది. ఈవెంట్ మొత్తంలో ఆ కుక్కే హైలైట్‌గా నిలిచింది’ అంటూ సల్మాన్‌పై ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. భన్సాలీతో సినిమా చేయడంలేదు ఈ కార్యక్రమంలో మీడియా వర్గాలతో మాట్లాడిన సల్మాన్ తన తదుపరి సినిమా గురించి ప్రకటించారు. ప్రముక దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో సల్మాన్ సినిమా చేయాల్సి ఉంది. సినిమాకు ‘ఇన్‌షాల్లా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సినిమాలో సల్మాన్‌కు జోడీగా ఆలియా భట్‌ను ఎంపిక చేశారు. అంతా ఓకే అనుకున్నాక సినిమా షూటింగ్ నిలిపివేయాల్సి వచ్చిందని భన్సాలీ ప్రకటించారు. ఇందుకు కారణం వెల్లడించలేదు. దాంతో ఇంతకీ భన్సాలీ, సల్మాన్ సినిమా ఉందా లేదా అనే డైలమాలో ఫ్యాన్స్ ఉన్నారు. దీనిపై సల్మాన్ ఈవెంట్‌ల్ స్పందిస్తూ.. తాను భన్సాలీతో కలిసి సినిమా చేయడంలేదని స్పష్టం చేశారు. దాంతో ఎప్పటినుంచో సల్మాన్‌తో కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్న ఆలియాకు అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. అయితే ‘ఇన్‌షాల్లా’ సినిమా మాత్రం ఉండబోతోందని సల్మాన్ వెల్లడించారు. అయితే ఎందుకు తాను ఈ సినిమా నుంచి తప్పుకొన్నారు అన్న విషయంలో మాత్రం సల్మాన్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. సినిమాలో సల్మాన్ ఆలియాతో పాటు తానకు స్నేహితురాళ్లైన డైసీ షాతో పాటు వలూషా డిసౌజాలను ఎంపికచేసుకుందామని సల్మా్న్ భన్సాలీతో చెప్పారని ఇందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో సల్మాన్‌కు కోపం వచ్చిందని అందుకే సినిమా నుంచి తప్పుకొన్నారని పలు బాలీవుడ్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ides4J
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...