Wednesday, 4 September 2019

Director Parasuram: జాక్ పాట్ కొట్టిన పరశురామ్.. మహేష్‌తో మూవీ ఫిక్స్

గీతగోవిందం లాంటి బ్లాక్‌బస్టర్ కొట్టిన ఆ సినిమా రిలీజ్ అయ్యి సంవత్సరం అయినా కూడా ఇంకా ఖాళీగానే ఉన్నాడు. అతని నెక్స్ట్ సినిమా ఎవరితో?, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?, ఏ బ్యానర్‌లో ఉంటుంది లాంటి విషయాల్లో సస్పెన్స్‌ కొనసాగుతుంది. మహేష్‌కి కథ వినిపించాడు, కానీ ఆ కథ ఏమైంది అనే విషయం పై ఇప్పటివరకు క్లారిటీ లేదు. కానీ ఫైనల్‌గా పరశురామ్‌కి సినిమా ఓకే అయ్యింది. అది కూడా సూపర్‌స్టార్ మహేష్‌బాబు తోనే. ప్రస్తుతం మహేష్‌బాబు పొంగల్ సినిమా ‘సరిలేరు నీకెవ్వరూ’ రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. కానీ షెడ్యూల్‌లో పోర్షన్ షూటింగ్ లేదు. అందుకే ఆ గ్యాప్‌లో పరశురామ్‌కి టైం ఇచ్చి కథ విన్నాడు మహేష్. ఆ కథ, దానికి పరశురామ్ ఇచ్చిన ట్రీట్మెంట్ అంతా కూడా మహేష్‌కి నచ్చింది. అన్నిటికి మించి పరశురామ్ దగ్గర బౌండెడ్ స్క్రిప్ట్ ఉంది. దాంతో ఆ సినిమాకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసాడు మహేష్. అయితే ఆ లైన్ పైనే అల్లుఅరవింద్‌కి అంత నమ్మకం లేదు. అందుకే గీతఆర్ట్స్‌లో ఉండాల్సిన మహేష్-పరశురామ్ సినిమా ఇప్పడూ మైత్రిమూవీమేకర్స్ చేతికి వచ్చింది. సుకుమార్‌తో మహేష్ సినిమా తేడా కొట్టాక మళ్ళీ మహేష్‌తో సినిమా కోసం శతవిధాలా ప్రయత్నించారు మైత్రిమూవీమేకర్స్. దాంతో సుకుమార్ సినిమా ఎపిసోడ్‌లో వాళ్ళ తప్పు లేదు అని డిసైడ్ అయిన మహేష్ మళ్ళీ వాళ్లకు సినిమా ఇచ్చాడు. అయితే ఆ సినిమా కూడా సరిలేరు నీకెవ్వరు‌లా నాన్ థియేట్రికల్ రైట్స్ తీసుకుని చేస్తాడా?, లేక రెమ్యునరేషన్‌తో చేస్తాడా అనేది మాత్రం ఇంకా తెలియలేదు. అలాగే వంశీ పైడిపల్లి‌తో కూడా మహేష్ సినిమా చెయ్యాల్సి ఉంది. కానీ ఆ సినిమాకి ఇంకా స్క్రిప్ట్ లాక్ అవ్వలేదు. అందుకే సరిలేరు నీకెవ్వరు ఫినిష్ అవ్వగానే పరశురామ్ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లానింగ్ చేస్తున్నారు. ఈ లోగా ఆ సినిమాకి సంబంధించిన మిగిలిన పనులు పూర్తి చేస్తారు. ఒక వేళ ఆ టైం కి వంశీ కూడా రెడీ గా ఉంటే రెండు సినిమాలు పారలెల్‌గా షూటింగ్ చేసే ఆలోచనలో ఉన్నాడు మహేష్. కాకపోతే వంశీ పైడిపల్లిసినిమాకి ప్రొడ్యూసర్ పరంగా ఇంకా క్లారిటీ రాలేదు. ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాకి మహేష్ నాన్ థియేట్రికల్ రైట్స్ అడిగాడు. అలా ఇవ్వడం వల్ల మహేష్‌తో బ్లాక్‌బస్టర్ సినిమా తీసిన కూడా ప్రొడ్యూసర్స్‌కి పెద్దగా మిగిలేది ఏమీ ఉండదు. అందుకే ఇప్పుడు దిల్‌రాజు వంశీ పైడిపల్లి-మహేష్ సినిమాని తన బ్యానర్ నుండి షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. సో,ఆ వ్యవహారాలు అన్నీ పూర్తయిపోతే మహేష్ కి పెద్దగా గెటప్ పరంగా పెద్దగా చేంజ్ ఓవర్ ఏమీ ఉండదు. కాబట్టి ఒకేసారి లాగించేసినా ఆశ్చర్యం లేదు. మొత్తానికి 2020 మహేష్ మూడు సినిమాలతో సందడి చెయ్యబోతున్నాడు అనేది మాత్రం ఫిక్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NUThrX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...