ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమను ఏలిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. వాళ్లెవరికీ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ, ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ‘బాహుబలి’ సినిమాతో బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించిన ప్రభాస్.. ‘సాహో’తో తన స్థాయిని మరింత పెంచుకున్నారు. కానీ, ఇదంతా ప్రభాస్ ఊహించనిది. నిజం చెప్పాలంటే అసలు ప్రభాస్ తాను సినిమా హీరోని అవుతాననే అనుకోలేదు. తండ్రి అడుగుతున్నా చూద్దాంలే అనేవారట. సుమారు 19 ఏళ్ల వయసప్పుడు తాను హీరో కావాలని ప్రభాస్ నిర్ణయించుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రెండు మూడు సినిమాలు చేసిన తరవాత తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనా అని అనుమానపడ్డారు. కానీ, ‘బాహుబలి’ తరవాత తాను తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని తనను తానే ప్రశంసించుకున్నారు. అయితే, అలాంటి ఎదుగుదలను, ఆ స్థాయిని చూసి ఆనందించడానికి, గర్వపడటానికి పక్కన తన తండ్రి లేరనే లోటు ప్రభాస్‌ను బాధపెడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని కూడా ఆయన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. Also Read: ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు అప్పట్లో యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్. అన్నయ్య కృష్ణంరాజుకు చేదుడు వాదోడుగా ఉంటూ గోపీకృష్ణ మూవీస్‌ను ఆయన హ్యాండిల్ చేశారు. అయితే, ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసింది తక్కువే. ప్రభాస్ హీరో అయిన తరవాత సూర్యనారాయణ రాజు గురించి ఎక్కువగా మాట్లాడటం మొదలైంది. కొడుకు స్టార్ హీరోగా ఎదుగుతున్న తరుణంలో సూర్యనారాయణ రాజు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. 2010 ఫిబ్రవరి 12న ఆయన కన్నుమూశారు. ఇదిలా ఉంటే, ‘సాహో’ సినిమా సందర్భంగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ ప్రభాస్ తండ్రిని ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నారు. సూర్యనారాయణ రాజు యంగ్ లుక్‌లో ఉన్న పాత ఫొటోను ఒకరితో ఒకరు షేర్ చేసుకున్నారు. ఈ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ ఫొటో చూస్తుంటే అచ్చం ప్రభాస్‌ను చూసినట్టే ఉంది. కాదు కాదు.. ప్రభాసే ఆయన తండ్రిలా ఉన్నారు. ఆ కళ్లు, ముక్కు అయితే తండ్రీకొడుకులకు సేమ్ టు సేమ్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2zLoDZF
v
No comments:
Post a Comment