Friday, 6 September 2019

బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్.. క్లారిటీ ఇచ్చిన ఇలియానా

మొత్తానికి తన ప్రేమ గురించి వస్తు్న్న వార్తలపై స్పందించారు . బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో విడిపోయిన మాట నిజమేనని సోషల్ మీడియా వేదికగా చెప్పకనే చెప్పారు. ‘యస్.. జీవితంలో మనం స్నేహితులను, కుటుంబీకులను, జీవిత భాగస్వాములను కోల్పోతాం. కానీ మన జీవితం నుంచి ఎవరు వెళ్లిపోయినా మనల్ని మనం కోల్పోకూడదు. జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే.. మనల్ని ఎవ్వరూ ప్రేమించడం లేదని తెలిసినప్పుడు మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనకి ఎవ్వరూ లేనప్పుడు మనకి మనమే తోడుగా నిలవాలి’ అని పేర్కొన్నారు. దీనిని బట్టి చూస్తే ఆమె ప్రియుడు ఆండ్రూతో విడిపోయారని వస్తున్న వార్తలు నిజమేనని తెలుస్తోంది. ఆండ్రూ, ఇలియానా ఆగస్ట్‌లోనే విడిపోయారట. కానీ ఈ విషయం గురించి ఇద్దరిలో ఎవ్వరూ స్పందించలేదు. చెప్పాలంటే ఇలియానా బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయారు అనడం కంటే భర్తతో విడాకులు తీసుకున్నారు అన్న పదం కరెక్ట్‌గా సూటవుతుందేమో. ఎందుకంటే.. 2017లోనే ఆండ్రూ, ఇలియానా పెళ్లి చేసుకున్నారు. 2017 క్రిస్మస్ సందర్భంగా ఇలియానా ఓ ఫొటో పోస్ట్ చేస్తూ ఆ ఫొటో తీసింది ‘హబ్బీ’ అని క్యాప్షన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇలియానా కెరీర్‌ సాదాసీదాగా సాగుతోంది. సరైన సినిమా అవకాశాలు రావడం లేదు. పెళ్లైందని చెప్పడం వల్ల ఆఫర్లు తగ్గిపోయాయేమో. అందుకే ఆండ్రూతో విడిపోయిందని వార్తలు వస్తున్నాయి. మరోపక్క ఇలియానా చిరంజీవికి జోడీగా నటించే బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇలియానాను కథానాయికగా ఎంపిక చేసుకోవాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ సినిమాతోనైనా టాలీవుడ్‌లో కుప్పకూలిపోయిన ఇలియానా కెరీర్ మళ్లీ పుంజుకుంటుందో లేదో చూడాలి. మరోపక్క ఆమె బాలీవుడ్‌లో పాగల్‌పంతి సినిమాలో నటిస్తున్నారు. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాల కోసం ఇలియానా బరువు తగ్గినట్లు కనిపిస్తున్నారు. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో చూసిన దానికంటే ఇప్పుడు ఆమె కాస్త సన్నగా కనిపిస్తున్నారు. చూడబోతే ఇక నుంచి ఇలియానా తన ఫోకస్‌ను పూర్తిగా తన కెరీర్‌పైనే పెట్టనున్నట్లు తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZT7wzw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...