Tuesday, 3 September 2019

ధనుష్ సినిమాలో హాలీవుడ్ విలన్

సౌతిండియా సినిమా స్థాయి ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. శంకర్, రాజమౌళి వంటి దర్శకులు దక్షిణాది సినిమాల స్థాయిని ప్రపంచ వ్యాప్తం చేశారు. ‘బాహుబలి’, ‘2.0’ చిత్రాలు హాలీవుడ్ మార్కెట్‌ను కూడా ఆకర్షించాయి. అందుకే, ఇప్పుడు హాలీవుడ్ నటులు కూడా భారతీయ సినిమాల వైపు చూస్తున్నారు. మన దర్శకులు కూడా సినిమా స్థాయిని పెంచడానికి హాలీవుడ్ నటులను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. Also Read: సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ‘పేట’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌ను తెరకెక్కించిన తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ప్రస్తుతం ధనుష్‌తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో విలన్‌గా ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ కాస్మోను తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ నిమిత్తం ఆయన చిత్ర యూనిట్‌తో కలిశారు. ఈ ఫొటోను చిత్ర నిర్మాణ సంస్థ వై నాట్ స్టూడియోస్ ట్వీట్ చేసింది. దిగ్గజ నటుడు తమ సినిమాలో నటించడం తమకు దక్కిన గౌరవమని పేర్కొంది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సైతం కాస్మోకు స్వాగతం పలుకుతూ ట్వీట్ చేశారు. కాగా, జేమ్స్ కాస్మో.. ‘హైలాండర్’, ‘బ్రేవ్ హార్ట్’, ‘వండర్ ఉమన్’, ‘గేమ్స్ ఆఫ్ థ్రోన్స్’ సిరీస్‌లలో కీలక పాత్రలు పోషించారు. ఇంత పెద్ద నటుడు ధనుష్ సినిమాలో నటిస్తుండటంతో దీనిపై అప్పుడే అంచనాలు ఏర్పడిపోయాయి. ఈ సినిమాలో ధనుష్ సరసన మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్నారు. వై నాట్ స్టూడియోస్ బ్యానర్‌పై శశికాంత్ నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రేయాస్ క్రిష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలో లండన్‌లో షూటింగ్ ప్రారంభంకానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2zNl8BP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...