Monday, 23 September 2019

‘సల్మాన్‌తో ప్రేమలో ఉన్నానని అనుకున్నారు.. ఫ్యాన్స్ వదినా అని పిలిచేవారు’

53 ఏళ్ల వయసులోనూ బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరే. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అన్న ప్రశ్న సల్మాన్‌ను ఎన్నో ఏళ్లుగా వెంటాడుతూనే ఉంది. ఆయనేమో పిల్లలు మంచి తండ్రిని కాగలనేమో కానీ మంచి భర్తను కాలేనని చెప్తూ మాటదాటేస్తుంటారు. సల్మాన్‌ గతంలో ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్‌లతో డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ కెరీర్ పరంగా మంచి సపోర్ట్‌ను అందించింది సల్మానే. కానీ సల్మాన్‌కు ఇద్దరితో సెట్ అవ్వలేదు. ఐష్.. అభిషేక్ బచ్చన్‌ని పెళ్లి చేసేసుకున్నారు. కత్రినా.. రణ్‌బీర్ కపూర్‌ని ప్రేమించారు. ఆ తర్వాత వీరిద్దరు కూడా విడిపోయారనుకోండి. ఈ విషయం పక్కన పెడితే.. 2010లో సల్మాన్ ఖాన్.. అనే నటిని బాలీవుడ్‌కి పరిచయం చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘వీర్’. చూడటానికి అచ్చం కత్రినా కైఫ్‌లా ఉందంటూ ఫ్యాన్స్ తెగ ఆశ్చర్యపోయారు. అయితే ఎటూ కత్రినా కైఫ్ హ్యాండ్ ఇవ్వడంతో సల్మాన్.. జరీన్‌ను డేటింగ్ చేస్తున్నారని అనుకున్నారు. దాంతో జరీన్‌ను అభిమానులు వదినా అని పిలిచేవారట. ఈ విషయాన్ని జరీన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే కత్రినా, ఐశ్వర్య కెరీర్ పరంగా టాప్ స్థానంలో ఉన్నప్పటికీ జరీన్‌ మాత్రం వారిలా పేరు తెచ్చుకోలేకపోయారు. దాంతో ఆమె బోల్డ్ క్యారెక్టర్స్ ఉన్న సినిమాల్లో నటిస్తున్నారు. అయితే జరీన్ కీలక పాత్రలో ‘హేట్ స్టోరీ 3’ అనే సినిమాలో నటించారు. ఇందులో జరీన్ చాలా బోల్డ్‌గా కనిపించారు. దాంతో ఫ్యాన్స్ ఆమెను వదినా అని పిలవడం మానేశారట. దాంతో తాను కాస్త ఊపిరి పీల్చుకున్నానని జరీన్ తెలిపారు. ఇప్పటివరకు జరీన్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ ఒక్క సాలిడ్ హిట్ కూడా లేదు. తొలి సినిమా సల్మాన్ ఖాన్‌తో చేయడంతో ఆమె పంట పండిందని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా వల్ల ఆమెకు బెస్ట్ ఫీమేల్ డెబ్యూ‌గా జీ సినీ అవార్డు తప్ప వచ్చిందేమీ లేదు. అయితే 2015లో వచ్చిన హేట్ స్టోరీ 3 సినిమాతో మాత్రం జరీన్ మంచి హిట్ అందుకున్నారు. ప్రస్తుతం జరీన్.. ‘డాకా’ అనే పంజాబీ చిత్రంతో పాటు ‘హమ్ భీ అకేలే తుమ్ భీ అకేలే’ అనే హిందీ సినిమాలో నటిస్తున్నారు. తెలుగులో గోపీ చంద్ నటిస్తున్న ‘చాణక్య’ సినిమాలో జరీన్ కీలక పాత్ర పోషిస్తు్న్నారు. ఆమె నటించిన తొలి తెలుగు సినిమా ఇదే. ఈ సినిమా ద్వారా జరీన్‌కు తెలుగులో మంచి అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34Yuqtn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...