Wednesday, 25 September 2019

వేణుమాధవ్ సెట్‌లో అందరినీ సరదాగా ఉంచేవారు: పవన్ కళ్యాణ్

ప్రముఖ హాస్యనటుడు మృతి వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా వేణుమాధవ్‌తో తన సినీ ప్రయాణాన్ని పవన్ గుర్తుచేసుకున్నారు. వేణు మంచి హాస్యనటుడని, మిమిక్రీలో కూడా నైపుణ్యం ఉండటంతో సెట్‌లో అందరినీ నవ్వించేవారని వెల్లడించారు. ఈ మేరకు వేణుమాధవ్ మృతికి సంతాపం తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. Also Read: ‘‘అందరినీ నవ్వించిన వేణుమాధవ్‌ ఇక లేరు అనే విషయం దిగ్భ్రాంతికి లోను చేసింది. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్‌ కోలుకుంటారు అనుకున్నాను. నటుడిగా ఎంతో భవిష్యత్‌ ఉన్న ఆయన మరణించడం బాధాకరం. ‘గోకులంలో సీత’ నుంచి నాతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. హాస్యం పండించడంలో మంచి టైమింగ్‌ ఉన్న నటుడు. మిమిక్రీలో కూడా నైపుణ్యం ఉండటంతో సెట్లో అందరినీ సరదాగా ఉంచేవారు. వర్తమాన రాజకీయ విషయాలపై ఆసక్తి చూపేవారు. వేణుమాధవ్‌ మృతికి నా తరఫున, జనసైనికుల తరఫునా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. వేణు మాధవ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను’’ అని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. Also Read: కాగా, గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న వేణుమాధవ్ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వేణుమాధవ్ మృతదేహాన్ని హాస్పిటల్‌ నుంచి నేరుగా కాప్రాలో ఉన్న ఆయన ఇంటికి తీసుకెళ్లనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ఫిల్మ్ ఛాంబర్‌లో వేణమాధవ్ పార్థివదేహాన్ని సందర్శనార్థం ఉంచుతామని శివాజీరాజా చెప్పారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2n1SGsN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...