Wednesday, 4 September 2019

మెగాస్టార్‌కు జోడీగా ఇలియానా..!

గోవా బ్యూటీ ఇలియానాకు చాలా కాలం తర్వాత టాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ లభించినట్లుంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇలియానాను కథానాయికగా ఎంపికచేసుకోవాలని చిత్రబృందం నిర్ణయించుకుందట. ఈ మేరకు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు తన వయ్యారమైన నడుము, చక్కటి అందంతో టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసిన .. చాలా కాలం తర్వాత ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ సినిమా ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేదు. అదీకాకుండా సన్నజాజిలా యువతను ఆకట్టుకున్న ఇలియానా ఈ సినిమాలో చాలా లావుగా కనిపించారు. దాంతో ప్రేక్షకులు కూడా ఆమెను స్వీకరించలేకపోయారు. ఇప్పుడు మెగాస్టార్‌తో జత కట్టబోతోంది కాబట్టి ఈసారైనా మళ్లీ తన సత్తా చాటుకుంటారో లేదో వేచి చూడాలి. అయితే.. ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో విడిపోయారని గతంలో వార్తలు వెలువడ్డాయి. ఇందుకు కారణం తన కెరీర్‌పై దృష్టి పెట్టలేకపోవడమేనని చిత్ర వర్గాల సమాచారం. తెలిసో తెలీకో ఆండ్రూ తన భర్త అని సోషల్ మీడియాలో చాలా సార్లు పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమె గర్భం కూడా దాల్చారని వార్తలు వచ్చాయి. ఇవన్నీ ఆమె కెరీర్‌పై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. వీటి వల్ల ఆండ్రూకి తనకు మధ్య మనస్పర్ధలు వచ్చి ఉంటాయని తెలుస్తోంది. అందుకే ఆమె తన ప్రేమకు గుడ్ బై చెప్పేసి ఇక నుంచి తన పూర్తి ఫోకస్‌ను సినిమాపై పెట్టాలనుకుంటున్నారట. ఇదివరకు మాటిమాటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పెట్టేసి అవి తీసింది తన హబ్బీ ఆండ్రూనే అని క్యాప్షన్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలా చేయడంలేదు. ఆమె తన బాయ్ ఫ్రెండ్‌తో విడిపోయారు అనడానికి ఇది మరో కారణం. మరోపక్క ఇలియానా హిందీలో పాగల్‌పంతి సినిమాతో బిజీగా ఉన్నారు. అనీజ్ బాజ్మీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్ అబ్రహం, అర్షద్ వార్సి, కృతి కర్బంద, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PMK2fX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...