Monday, 23 September 2019

ఎన్టీఆర్‌తో అట్లీ సినిమా.. తమిళ తంబీలకు తారక్ యాక్షన్ షో!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ‘RRR’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌తో పాటు ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మరో హీరోగా నటిస్తున్నారు. భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అయితే, ఈ సినిమా తరవాత ఎన్టీర్ చేయబోయే ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో ఒక టాక్ వినిపిస్తోంది. తమిళంలో స్టార్ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న అట్లీ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన తరవాత సినిమా చేయబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్‌కు అట్లీ కథ వినిపించారని, ఆయన కూడా పచ్చజెండా ఊపారని అంటున్నారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ కానీ, వైజయంతి మూవీస్ సంస్థ గానీ నిర్మించే అవకాశం ఉందంటున్నారు. ఈ సినిమా ద్విభాషా చిత్రంగా తెరకెక్కనుందట. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరించనున్నారని సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. Also Read: ఈ వార్తే గనుక నిజమైతే ఎన్టీఆర్ డైరెక్ట్‌గా తమిళ తంబీలను పలకరించినట్లవుతుంది. ఎన్టీఆర్ ఇప్పటి వరకు డైరెక్ట్ తమిళ చిత్రం చేయలేదు. వాస్తవానికి ‘RRR’ కూడా తమిళంలో విడుదలవుతుంది. కాకపోతే, అనువాదం చేసి విడుదల చేస్తారు. కానీ, అట్లీతో ఎన్టీఆర్ చేయబోయే సినిమా అలా కాదు.. మహేష్ బాబు ‘స్పైడర్’ మాదిరిగా ఒకేసారి రెండు భాషల్లో తెరకెక్కుతుందని తెలుస్తోంది. కాగా, అట్లీ ప్రస్తుతం ‘బిగిల్’ సినిమాతో బిజీగా ఉన్నారు. దళపతి విజయ్‌తో అట్లీ చేస్తోన్న మూడో చిత్రం ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘తెరి’, ‘మెర్సల్’ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. అక్టోబర్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2mhy1AR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...