Sunday, 22 September 2019

‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్.. మెగా హీరోలంతా ఒకే చోట

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభమైంది. కళ్లు మిరిమిట్లు గొలిపే తీరులో ఈ ప్రీ రిలీజ్ వేడుక ఏర్పాట్లు చేశారు. లక్షలాదిగా అభిమానులు హాజరయ్యారు. మెగా అభిమానులతో ఎల్బీ స్టేడియం నిండిపోయింది. ఈ వేడుకకు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పాటు దర్శకధీరుడు రాజమౌళి, మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. అయితే, వీరితో పాటు మెగా హీరోలంతా ఈ వేడుకలో సందడి చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాబ్రదర్ నాగబాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్‌తో పాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తున్నారు. అలాగే ఇండస్ట్రీకి చెందిన పెద్దలంతా హాజరవుతున్నారు. ఈ ఈవెంట్‌కు సుమ, హేమంత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. కాగా.. స్వాతంత్య్ర సమరయోధుడు, రాయలసీమ పోరాటయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించారు. అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, రవి కిషన్, నయనతార, తమన్నా ప్రధాన పాత్రలు పోషించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించారు. సుమారు రూ.270 కోట్ల భారీ బడ్జెత్‌తో తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3379sH1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...