Tuesday, 3 September 2019

సన్నీ చూపు మళ్లీ పోర్న్ వైపు.. ఇది నిజమేనా?

సన్నీ లియోనీ.. ఈ పేరు ఎన్నో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. ఆమె జీవితంలోని పోర్న్‌స్టార్ అనే యాంగిల్‌ని పక్కనబెట్టి చూస్తే నేల మీద నుండి నింగికి ఎగిసిన ఒక ఫైటర్‌వుమెన్ కనిపిస్తుంది సన్నీ లియోనీలో. కానీ ఆమెకి గుర్తింపు తెచ్చింది, హోదా ఇచ్చింది మాత్రం పోర్న్ ప్రపంచమే. వాటివల్లే కరణ్‌జిత్‌ కౌర్ కాస్త సన్నీ లియోనీగా మారి బిగ్‌బాస్‌తో ఇండియా‌లో అడుగుపెట్టి, స్ప్లిట్స్‌ విల్లాకి కో హోస్ట్‌గా అదరగొట్టి, జిస్మ్‌‌తో సెగలు రేపింది. దాంతో కెనడియన్ పోర్న్ స్టార్ కాస్త బాలీవుడ్ హీరోయిన్‌గా మారింది. అయితే సన్నీ బాలీవుడ్‌లో హీరోయిన్‌గా మారినా ఆమెకి వచ్చే పాత్రలు మాత్రం మారలేదు. కేవలం అడల్ట్‌ని టార్గెట్ చేసిన ఎరోటిక్ మూవీస్‌లో మాత్రమే ఆమెకి ఆఫర్స్ వచ్చేవి. అయినప్పటికీ ఆమె వాటినే చేస్తూ నిలదొక్కుకుంది. అయితే ఒక నేషనల్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆమె కెరీర్‌ని మలుపు తిప్పింది. ఆ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఎలాంటి ప్రశ్నలు అడిగినా ఆమె మాత్రం తడబడకుండా జవాబులిచ్చింది. దాంతో ఆమె ఇన్నర్ పర్సనాలిటీ‌కి బాలీవుడ్‌లో అంతా ఫిదా అయ్యారు. నిజాయితీకి అబ్బురపడ్డారు. ఖాన్స్‌తో సహా అంతా ఆమె గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. వాళ్ళ సినిమాల్లో ఆమెకి అవకాశాలిచ్చారు. దాంతో సన్నీ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. తెలుగులో కూడా రెండు సినిమాల్లో కనిపించి ఆయా సినిమాలకు తనవంతు కాంట్రిబ్యూట్ చేసింది ఈ హాట్ బ్యూటీ. అయితే, సన్నీ మిగతా సినిమాల్లో కూడా కనిపించడం మొదలుపెట్టాక ఆఫర్స్ పెరిగాయి కానీ.. అనుకున్న రేంజ్‌లో విజయాలు రాలేదు. ఇప్పుడు కూడా రెండు మూడు సినిమాలతో బిజీగానే ఉంది. కానీ వాటి తరువాత ఆమె కెరీర్ పరిస్థితి ఏంటి అంటే మాత్రం ఆన్సర్ లేదు. దానికి కారణం గతంలో కాసులు కురిపించిన ఆమె సినిమాల్లో కూడా అందాల ఆరబోత అనేది ప్రధాన ఆకర్షణ. ఇప్పుడు మాత్రం ఆమెకి నటనలో కాస్త స్కోప్ ఉన్న సినిమాలు ఆఫర్ చేస్తున్నారు. కానీ ఆమెకి తన నటనతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేంత టాలెంట్ లేదు. అందుకే ఒకవేళ ముందు ముందు తన కెరీర్ ఇలానే కొనసాగితే మనుగడ కష్టం అనేది నిజం. అందుకే తనను రిచ్ పెర్సన్‌గా చేసిన పోర్న్ ఇండస్ట్రీ‌కి వెళితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో సన్నీ ఉన్నట్టు కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అవి ఆమెకి సన్నిహితంగా ఉండేవాళ్ళ దగ్గర నుండి వచ్చాయని అంటున్నారు. పోర్నోగ్రఫీకి ఇప్పుడు ఎప్పుడూ డిమాండే. దానికి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ సన్నీ పోర్న్ ఇండస్ట్రీ‌కి వెళ్లినా అక్కడ ఎంతయినా ఇవ్వడానికి రెడీ అంటారు. అందుకే ఆమె ఆ ఆలోచన చేసి ఉండొచ్చు. కానీ ఒక్కసారి అక్కడికి వెళితే మళ్ళీ బాలీవుడ్ ఎంట్రీ అనేది ఉండదు. మరి ఈ ఆలోచనలతో ఊగిసలాడుతున్న ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఆమె మళ్ళీ పోర్న్‌లోకి వస్తే బావుండు అని కోరుకునేవాళ్ళ సంఖ్యే ఎక్కువగా ఉంటుంది కాబట్టి సన్నీ డెసిషన్ వాళ్ళకే ఫేవర్‌గా ఉంటుందేమో వేచిచూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LqWZGy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...