Friday, 27 September 2019

కోర్టుకు సల్మాన్ ఖాన్ డుమ్మా.. హెచ్చరించిన జడ్జ్

బాలీవుడ్ నటుడు తన కేసుకు సంబంధించిన వాదనలకు డుమ్మా కొట్టారు. దాంతో జోధ్‌పూర్ న్యాయస్థానానికి చెందిన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతికేళ్ల క్రితం ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా చిత్రీకరణలో భాగంగా సల్మాన్ ఖాన్ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ వెళ్లారు. అక్కడి అడవుల్లో రెండు కృష్ణజింకలను వేటాడారు. ఆ సమయంలో సల్మాన్‌తో పాటు సైఫ్ అలీ ఖాన్, సోనాలి బింద్రే, టబు, నీలమ్ కొఠారి, దుష్యంత్ సింగ్ అనే స్థానికుడు కూడా ఉన్నారు. ఈ విషయం తెలిసి అక్కడి స్థానికులు సల్మాన్‌పై కేసు వేశారు. అప్పటి నుంచి నానుతూ వచ్చిన ఈ కేసుపై జోధ్‌పూర్ న్యాయస్థానం ఈ ఏడాది తుది తీర్పునిచ్చింది. సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. మిగతావారిని నిర్దోషులుగా తేల్చింది. దాంతో ఒకరోజు పాటు సల్మాన్ జోధ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే తనపై వేసిన కేసును, విధించిన శిక్షను రద్దుచేయాలని కోరుతూ కొన్ని నెలల క్రితం సల్మా్న్ రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జులై నుంచి వాదనలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఒక్క వాదనకు కూడా సల్మాన్ హాజరుకాలేదు. దాంతో హైకోర్టు జడ్జ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు జరగబోయే కేసు వాదనకు సల్మాన్ హాజరుకాకపోతే బెయిల్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుందని జడ్జ్ ముందు నుంచీ వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. అయినా కూడా సల్మాన్ అవేవీ పట్టించుకోలేదు. ఈరోజు కూడా సల్మాన్ కోర్టుకు హాజరుకాకపోవడంతో కేసు తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేశారు. ఆరోజు కూడా సల్మాన్ కోర్టుకు హాజరుకాకపోతే బెయిల్ రద్దు అవుతుందని జడ్జ్ వార్నింగ్ ఇచ్చారు. మరోపక్క సల్మాన్‌ను చంపేస్తామంటూ పంజాబ్‌ యూనివర్శిటీకి చెందిన గేరీ అనే స్టూడెంట్ యూనియన్ లీడర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. సల్మాన్‌కు ఉరిశిక్ష ఖరారైందంటూ తన ఫేస్‌బుక్ ఎకౌంట్‌లో పోస్ట్ చేశాడు. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సల్మాన్‌కు భద్రత కల్పించారు. ఈ కేసుపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2lx4vXE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...