Thursday, 19 September 2019

కరీనా కపూర్: అమ్మా వెళ్లకు అని ఏడుస్తాడు.. నా గుండె పగిలిపోతుంది

బాలీవుడ్ బోబో రేపు తన 39వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఇప్పటికే ఆమె భర్త సైఫ్ అలీ ఖాన్‌కు చెందిన హరియాణాలోని పటౌడీ ప్యాలెస్‌లో ఘనంగా బర్త్‌డే ఏర్పా్ట్లు జరుగుతున్నాయి. అంతకంటే ముందే కరీనా బర్త్‌డే వేడుకలు ఆమె జడ్జ్‌గా వ్యవహరిస్తున్న రియాల్టీ షో ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’లో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కరీనా తన కుమారుడు తైమూర్ అలీ ఖాన్ గురించి మాట్లాడారు. ఓ తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరో పక్క సినిమాలు చేసుకుంటుండంలో తనకు ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపారు. అయితే పని మీద ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు తైమూర్ ముఖం చూసి గుండె పగిలిపోతుంటుందని కరీనా వెల్లడించారు. ‘నేనెప్పుడైనా బయటికి వెళ్తే తైమూర్ బాధగా నావైపు చూస్తూ.. ‘అమ్మా వెళ్లకు’ అంటాడు. అది విని నా గుండె పగిలిపోతుంది. ఒక్కోసారి వాడు ఎక్కడ ఏడుస్తాడోనని బాయ్ చెప్పకుండా, కనిపించకుండా ఇంటి నుంచి వెళ్లిపోవాల్సి వస్తుంటుంది’ అని వెల్లడించారు. తైమూర్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారంటే నమ్ముతారా? పుట్టినప్పుడే తైమూర్ టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు. తైమూర్ ఎప్పుడెప్పుడు బయటికి వస్తాడా? అని వాడి ఫొటోల కోసం పలు మీడియా ఫొటోగ్రాఫర్లు సైఫ్ నివాసం ముందే పడిగాపులు కాస్తుంటారు. తైమూర్ పేరుతో కేరళలోని ఓ దుకాణంలో ఏకంగా బొమ్మలనే అమ్మేస్తున్నారంటే ఈ బుల్లి పటౌడీ నవాబ్‌కు ఎంతటి పాపులారిటీ ఉందో తెలుస్తోంది. ఎయిర్‌పోర్ట్ వద్ద తైమూర్ ఫొటోల కోసమే ఎదురుచూసేవారు చాలా మంది ఉన్నారు. అందుకే తన తల్లి కరీనా నా కుమారుడు ఇండియాస్ సూపర్ స్టార్ అని గర్వంగా చెప్పుకొంటూ ఉంటారు. అయితే రోజు రోజుకీ తైమూర్‌కి పెరుగుతున్న పాపులారిటీ చూసి కరీనా, సైఫ్ దంపతులు కాస్త చింతిస్తున్నారు. ఎందుకంటే తైమూర్ ఎక్కడున్నా వాడిని ఫొటోగ్రాఫర్లు చుట్టుముడుతున్నారు. ఇలాగే కొనసాగితే రేపు వాడు పెద్దయ్యాక ఫొటోలు ఎందుకు తీయలేదని ఎక్కడ తమపై కోపం తెచ్చుకుంటాడోనని భయంగా ఉందని ఒకానొక సందర్భంలో కరీనా అన్నారు. వీటన్నింటికీ దూరంగా ఉంచేందుకు తైమూర్‌ను విదేశాల్లో బోర్డింగ్ స్కూల్‌కి పంపించాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. వర్క్ పరంగా ప్రస్తుతం కరీనా ‘గుడ్ న్యూస్’, ‘అంగ్రేజీ మీడియం’ సినిమాలతో బిజీగా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30eBh2e
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...