Monday, 30 September 2019

‘ఐష్ ప్రపంచంలోనే అందమైన యువతి.. ఆమెను ఇలా చేస్తారా?’

మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్య రాయ్‌ను మించిన అందం ఈ భూమ్మీద మరొకటి లేదనే చెప్పాలి. ఆ తర్వాత ఎంతమంది మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అయినా ఐష్ అందం ముందు తక్కువనే చెప్పాలి. ఆమె ఎలాంటి దుస్తుల్లోనైనా అందంగానే కనిపిస్తారు. అయితే ఇటీవల ఐష్ ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనేందుకు పారిస్ వెళ్లారు. లావెండర్ కలర్ దుస్తుల్లో ర్యాంప్ వాక్ చేశారు. అయితే ఐష్ దుస్తులపై ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ అయిన వెండెల్ రోడ్రిక్స్ కామెంట్ చేశారు. ‘ప్రపంచంలోనే అందమైన యువతి . అలాంటిది ఆమెకు ఈ చెత్త డ్రెస్ వేసి అసహ్యంగా తయారుచేస్తారా? ఐష్ డ్రెస్‌ను డిజైన్ చేసిన వ్యక్తిని వెంటనే తొలగించండి. వాడికి హాలోవీన్ పండగ వచ్చే నెలలో అని చెప్పండి’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఐష్ ఫొటోను పోస్ట్ చేస్తూ కామెంట్ చేశాడు. ఐష్ వేసుకున్న డ్రెస్‌ని పారిస్‌కి చెందిన డిజైనర్ జియామ్ బటిస్టా వల్లీ డిజైన్ చేశారు. డ్రెస్ బాగానే ఉంది కానీ ఐష్ వేసుకున్న మేకప్ మాత్రం కాస్త ఓవర్ అయింది. కళ్లకు మల్టీకలర్డ్ రంగులు పూసుకున్నారు. చెప్పులు కూడా చూడటానికి ఫన్నీగా ఉన్నాయి. అయితే ఆ డిజైనర్ చేసిన కామెంట్‌పై ఐష్ ఇంకా స్పందించలేదు. అయినా ఐష్ ఇలాంటి కామెంట్స్‌ని అస్సలు పట్టించుకోరు. గతంలో ఆమె కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కి వెళ్లినప్పుడు పర్పుల్ కలర్ లిప్‌స్టిక్ వేసుకున్నారు. దాంతో ఆమె లుక్ తెగ వైరల్ అయింది. చాలా మంది అభిమానులకు ఐష్ అలాంటి లిప్‌స్టిక్ వేసుకోవడం నచ్చలేదు. తనపై అన్ని కామెంట్స్ వచ్చినా కూడా తాను పట్టించుకోనని ఐష్ తెలిపారు. ప్రస్తుతం ఐష్ వెళ్లిన ఫ్యాషన్ షోకు ఎప్పటిలాగే తన కుమార్తె ఆరాధ్యను కూడా తీసుకువెళ్లారు. ఇక ఐష్ వర్క్ విషయానికొస్తే చివరగా ఆమె హిందీలో ‘ఫ్యాన్నే ఖాన్’ సినిమాలో నటించారు. అనిల్ కపూర్, రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఐష్ ఫేమస్ సింగర్ పాత్రను పోషించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది. ఆ తర్వాత కొంతకాలం సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న ఐశ్వర్య.. ఇటీవల తన గురూజీ అయిన మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ అనే తమిళ సినిమాకు సంతకం చేశారు. ఇందులో ఐష్ చోళా మహారాజు భార్య పాత్రలో నటించనున్నారు. ఆమె విలన్‌గా డబుల్ రోల్ పోషించనున్నట్లు తెలుస్తోంది. ఏళ్ల తర్వాత ఐష్, మణిరత్నం కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కావడంతో దీనిపై చాలా అంచనాలు ఉన్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2n9kMTF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...