Monday, 30 September 2019

చిరంజీవి అబద్దం చెప్పారా?.. అందుకే కేసులు వెనక్కి తీసుకున్నారా?

సైరా...దేశం మొత్తం ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకులముందుకు రాబోతుంది. అయితే నిన్నమొన్నటివరకు ఈ సినిమా కథకి డబ్బులు చెల్లించాలి అని డిమాండ్ చేసి, కోర్ట్‌కి కూడా వెళ్లారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు.ఆ రోజు కోర్ట్‌లో వాదనల అనంతరం తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమాపై వాళ్ళు వేసిన కేసులు వెనక్కి తీసుకున్నారు. దాంతో ఎలాంటి వివాదాలు లేకుండా క్లీన్ ఇమేజ్‌తో రిలీజ్‌కి రెడీ అయ్యింది సైరా. Also Read: వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో ఉయ్యాలవాడ వంశస్థులు సైరా కోసం డబ్బులు డిమాండ్ చేశారు. అయితే అప్పుడు రామ్ చరణ్ ఆ వంశంలోని మొత్తం 23 కుటుంబాలకు ఒక్కొక్కరికి 15 లక్షల చొప్పున సాయం చేస్తా అని మాట ఇచ్చారట. కానీ ఎక్కడ తేడా వచ్చిందో ఏమో కానీ ఉయ్యాలవాడ వారసులు కుటుంబానికి రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నారు అంటూ ఒక వార్త బయలుదేరింది. చిరంజీవి కూడా ఆ మాట నిజం అని చెప్పుకొచ్చారు. Also Read: అయితే తమకు అన్యాయం జరుగుతుంది అంటూ వాళ్ళు ముందు పోలీస్ కేస్ పెట్టారు, ఆ తరువాత కోర్ట్ మెట్లు ఎక్కారు?. తమకి ముందు లీగల్‌గా అగ్రిమెంట్ చేసి ఇప్పుడు మాత్రం దాన్ని పట్టించుకోవట్లేదు అని వాళ్ళు కేస్ వేశారు. ఆ కేస్ పై కోర్ట్ కూడా విచారణ చేపట్టింది. అయితే వాళ్ళు సినిమా ఆపాలని వేసిన కేసుని, సినిమా ముందు తమకు చూపించాలని వేసిన కేస్‌ని కూడా కొట్టేసారు. దాంతో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో అని అనుకున్నారు అంతా. Also Read: కట్ చేస్తే ఇప్పుడు వాళ్ళు తాము వేసిన కేసుని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. సినిమా రిలీజ్ అవుతున్న టైమ్‌లో సినిమాపై వివాదాలు కరెక్ట్ కాదు అని వాళ్ళు ఫీలై కేసులు ఉపసంహరించుకున్నారా? లేక అసలు ఏం జరిగింది అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికయితే ఆ వివాదం మాత్రం క్లోజ్ అయ్యింది. దీంతో సైరా యూనిట్ అండ్ చిరంజీవి అభిమానులు హ్యాపీ‌గా ఫీల్ అవుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2oETKUB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...