Tuesday, 24 September 2019

అవసరమైతే న్యూడ్ సీన్లలోనూ నటిస్తానంటున్న ‘ధోనీ’

హీరోయిన్ల చేత ఎక్స్‌పోజ్ చేయించి సినిమా మొత్తాన్ని నడిపించేయాలని చూసే దర్శకులు లేకపోలేదు. కానీ హీరో చేత మాత్రం అలాంటి సన్నివేశాలు చేయించరు. ఎందుకంటే సినిమాకు హీరోలే కీలకమని, వారి చేత ఇలాంటి సన్నివేశాలు షూట్ చేస్తే ఫ్యాన్స్ ఒప్పుకోరనేది వారి అభిప్రాయం. కానీ ఇలాంటి విషయాలు తాను పట్టించుకోనని అంటున్నారు బాలీవుడ్ నటుడు . ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డ్రైవ్’. తరుణ్ మన్సుఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాక్వెలీన్ ఫెర్నాండెజ్ కథానాయికగా నటించారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే కరణ్ నిర్మించిన ‘కళంక్’, ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచాయి. దాంతో ఈ సినిమాను విడుదల చేసి కరణ్ రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు. అందుకే సినిమాను స్ట్రీమింగ్ మీడియా సర్వీ్స్ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేస్తున్నారు. అయితే ఇందులో సుశాంత్ న్యూడ్ సీన్స్‌లో నటించారట. ఈ విషయాన్ని సుశాంత్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘అంటే నేను పూర్తిగా దుస్తులు లేకుండా కనిపించను. నాకు నా శరీరాన్ని చూపించుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ నేను నటిస్తున్న పాత్రకు న్యూడ్ సీన్లు అవసరం అనిపిస్తే చేయడానికి సిద్ధమే. అయినా ఏ కారణం లేకుండా న్యూడ్ సీన్లను పెట్టరు కదా..’ అని వెల్లడించారు సుశాంత్. ‘పవిత్ర రిష్తా’ అనే హిందీ సీరియల్‌తో బాగా పాపులారిటీ తెచ్చుకున్నారు హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. ఆ తర్వాత ఆయనకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ‘కాయ్ పోచే’ సినిమాతో తానేంటో నిరూపించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ‘ఎంఎస్ ధోనీ-ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమా ఆయనకు బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా విడుదలయ్యాక అందరూ సుశాంత్‌ను ధోనీ అనే పిలవడం మొదలుపెట్టారు. ఆయన సినిమాలను ఎంపిక చేసుకోవడంలో కాస్త వేగం తగ్గించారు. అయినప్పటికీ ఆయన సినిమాలు ఎప్పుడు వచ్చినా అభిమానులు ఆరాధిస్తు్న్నారు. సుశాంత్ ప్రధాన పాత్రలో నటించిన ‘చిచ్ఛోరే’ సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆయన ‘దిల్ బిచారా’ సినిమాతో బిజీగా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2mjStRw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...