Tuesday, 24 September 2019

Bigg Boss 13: నాతో ప్రాబ్లమ్ ఉంటే నన్ను బ్యాన్ చేయండి: సల్మాన్

వివాదాలకు పెట్టింది పేరు బాలీవుడ్ సూపర్ స్టార్ . ఏదో ఒక వివాదంతో ఆయన వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఓ ఫొటోగ్రాఫర్‌పై కేకలు వేస్తూ సల్మాన్ వార్తల్లో నిలిచారు. సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్ బాస్ 13వ సీజన్ త్వరలో ప్రారంభం కాబోతోంది. దాదాపు 12 ఏళ్లుగా సల్మాన్ ఖాన్‌ దీనికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. సోమవారం ముంబయిలో సీజన్ 13కు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ప్రెస్ మీట్‌ను నిర్వహించారు ఫొటోలు తీయాలన్న ఆత్రుతతో సల్మాన్ దారికి అడ్డుపడ్డాడు. దాంతో సల్మాన్‌కు కోపం వచ్చింది. ‘ఎందుకు నా దారికి అడ్డుపడుతున్నారు. మీకు నాతో ఏదన్నా సమస్య ఉంటే నన్ను బ్యాన్ చేయండి. ఇలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి. కానీ మీరు ఫొటోల కోసం ఇలా ప్రవర్తిస్తే షో ఎలా కొనసాగుతుంది? నా ఫొటోలు తీసే అవకాశం ప్రతి ఒక్కరికీ వస్తుంది’ అని అరిచారు. ఈ ఘటనను అక్కడున్న మీడియా వర్గాలు వీడియో తీశాయి. అనంతరం అక్కడున్న షో నిర్వాహకులు పరిస్థితిని అదుపు చేశారు. అయినప్పటికీ సల్మాన్‌కు ఆ ఫొటోగ్రాఫర్‌పై కోపం తగ్గలేదు. అతని వైపు కోపంగా చూస్తూనే ఉన్నారు. అనంతరం బిగ్ బాస్ 13 షో గురించి సల్మాన్ మాట్లాడారు. ‘ఇంతకుముందు ముంబయిలోని లోనావలా ప్రాంతంలో బిగ్ బాస్ షోను షూట్ చేసేవాళ్లం. ఇప్పుడు ముంబయిలోని ఫిలిం సిటీకి మార్చాం. ఎందుకంటే బిగ్ బాస్ వల్ల లోనావాలా, ఖాండాలా ప్రాంతాలకు విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది. ఈ రెండు ప్రదేశాలు టూరిజం స్పాట్స్‌గా మారాయి. దాంతో అక్కడి వచ్చే ప్రజలను అదుపు చేయడం కష్టమవుతోంది. అదే ఫిలిం సిటీలో అయితే షోకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. ప్రమోషన్స్ కోసం సెలబ్రిటీలు రావడానికి కూడా వారికి వీలుగా ఉంటుంది. కానీ సాయంత్రం వేళల్లో ఫిలిం సిటీకి వెళ్లే రోడ్డులో చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇదొక్కటే సమస్య’ అని వెల్లడించారు. ఎప్పటిలాగే దాదాపు మూడు నెలల పాటు బిగ్ బాస్ 13 షో జరుగుతుంది. కానీ చివరి నాలుగు వారాలు మాత్రం ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు. 29 నుంచి బిగ్ బాస్ 13వ సీజన్ ప్రారంభం కానుంది. గతంలో సల్మాన్ ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. ఓ చిన్నారిపై బాడీగార్డ్ చేయిచేసుకోవడంతో సల్మాన్‌కు కోపం వచ్చి అతన్ని కొట్టడం వివాదాస్పదమైంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2miGSCl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...