Thursday, 5 September 2019

Big B: ఆ ఇద్దరే నా ఆరాధ్యమూర్తులు

అభిమానులు హీరోలను దేవుళ్లలా భావిస్తారు. కానీ ఓ హీరో మరో హీరోని ఆరాధించడం గురించి విన్నారా? బాలీవుడ్ మెగాస్టార్ ఇదే చేస్తున్నారు. లెజండరీ బాలీవుడ్ నటులు వహీదా రెహమాన్, దిలీప్ కుమార్‌లు తనకు ఆరాధ్యమూర్తులని అంటున్నారు. ఈ విషయాన్ని సూపర్‌స్టార్ సింగర్ అనే టీవీ షోలో బిగ్‌బి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి వహీదా, ఆశా పరేఖ్‌లు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమితాబ్ వారితో లైవ్ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ‘వహీదా జీతో నాకు ‘రేష్మా ఔర్ షేరా’ సినిమాలో కలిసి నటించే అవకాశం లభించింది. చిత్రీకరణ సమయంలో ఓ ఎడారిలో సునీల్ దత్, వహీదా జీ కలిసి చెప్పుల్లేకుండా నిలబడే సన్నివేశం ఒకటి ఉంది. ఓ పక్క ఎండ మండిపోతుంటే వహీదా జీ ఎలా చెప్పుల్లేకుండా నిలబడతారా? అని కంగారుపడేవాడిని. డైరెక్టర్ బ్రేక్ చెప్పగానే నేను ఆమెకు చెప్పులు తీసుకుని వెళ్లాను. ఆ జ్ఞాపకం నాకెంతో విలువైనదో చెప్పలేను. నా జీవితంలో వహీదా, దిలీప్ కుమార్‌జీలే ఆరాధ్యమూర్తులు. ఇప్పటివరకు బాలీవుడ్‌లోని అందమైన నటీమణుల్లో వహీదా రెహమనే మొదటి స్థానంలో ఉంటారు. ఆమె గొప్ప నటే కాదు గొప్ప మనసున్న మనిషి కూడా. భారతీయ మహిళలకు వహీదానే ఉదాహరణ. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ కోసం ఆమె ఎనలేసి సేవలు అందించారు’ ‘వాటి గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. 1978లో వచ్చిన త్రిషూల్ సినిమాలో వహీదా నాకు తల్లి పాత్రలో నటించారు. ఆ తర్వాత 1973లో వచ్చిన ఫగున్ సినిమాలో నా భార్య జయా బచ్చన్‌కు తల్లిగా నటించారు. అంతేకాదు.. 2002లో వచ్చిన ఓం జై జగదీశ్ సినిమాలో నా కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు కూడా తల్లిగా నటించారు’ అన్నారు. ఈ మాట వినగానే వహీదా పగలబడి నవ్వుకున్నారు. ‘బచ్చన్ జీ ఈ విషయాలన్నీ చెబుతుంటే ఓ పక్క సంతోషంగా ఉంది మరో పక్క వింతగా ఉంది. ఇలాగే కొనసాగితే రేపు అభిషేక్ పిల్లలకు అమ్మమ్మ పాత్రలో కూడా నటిస్తానేమో’ అని చమత్కరించారు వహీదా. ప్రస్తుతం అమితాబ్.. సైరా నరసింహారెడ్డి సినిమాతో పాటు బటర్‌ప్లై, బ్రహ్మాస్త్ర, గులాబో సితాబో, చెహరే సినిమాలతో బిజీగా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HPfzYh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...