Sunday, 1 September 2019

Allu Arjun: హే!! అల వైకుంఠపురా.. బన్నీ లుక్ స్మోకింగ్ యాడ్ అట!

వెనుక ఎత్తైన అద్దాల మేడలు.. లొకేషన్‌ మరింత రిచ్ నెస్ కోసం లగ్జరీ కారు.. ఆ కారులో నుండి సూటు బూటు వేసుకుని ఓ స్టైలిష్ పర్సన్ తిగితే సీన్ చినిగిపోతుంది కాదా.. కాని అక్కడే ఓ ట్విస్ట్.. ఆ లగ్జరీ కారు నుండి సూటూ బూటు వేసుకుని ఓ స్టైలిష్ పర్సన్ దిగారు. సూటు వేశాడు కాని గుండీలు పెట్టలేదు.. షూ వేశాడు కాని సాక్స్ వదిలేశాడు.. పైగా ఫ్యాట్ పైకి మడతపెట్టి మనకి సూట్ సెట్ కాదని ఓ ఇరిగిపోయిన స్టూల్ మీద కూర్చుని సెక్యురిటీ గార్డ్ దగ్గర ఉన్న నాటు బీడీ నోట్లో పెట్టుకుని అగ్గిపుల్ల వెలిగించుకుంటున్నాడు. అసలు ఆ సీన్‌లో బ్యాగ్రౌండ్‌కి మనోడు గెటప్‌కి అసలు సంబంధం లేకపోయినా.. చిన్న పోస్టర్‌లోనే కంటెంట్ రిలేటెడ్ మెటీరియల్‌ను అందించి సంథింగ్ ఏదో ఉంది? అన్న క్యూరియాసిటీ కలిగిస్తున్నాడు గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్. స్టైలిష్ స్టార్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న ‘అల.. వైకుంఠపురములో..’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆదివారం నాడు విడుదల చేశారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్ హిట్లు ఉండటంతో బన్నీ లాంగ్ గ్యాప్ తీసుకుని మరీ ఈ సినిమా చేస్తుండటంతో మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ విషయానికి వస్తే.. సంథింగ్ డిఫరెంట్‌గానే ఉందని కామన్ ఆడియన్స్, మూవీ లవర్స్ అంటుంటే మన ‘పెరసట్టు’ దర్శకుడు, మూవీ క్రిటిక్‌ మహేష్ కత్తి మాత్రం ఫస్ట్‌లుక్‌లో బొక్కలు వెతికే పనిమొదలుపెట్టారు. అంతేలే అందరిలా లైట్ అనుకుంటే తాను క్రిటిక్ ఎందుకు అవుతాను అనుకున్నాడో ఏమో కాని.. ‘అల.. వైకుంఠపురములో..’ ఫస్ట్ లుక్‌‌ను స్మోకింగ్ యాడ్ చేసేశాడు. దీనిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. ‘పోషే కార్లో తిరిగినా.. పొగతాగితే మాత్రం బతుకు బస్టాండే.. ఎంత చక్కని నో స్మోకింగ్ మెసేజో కదా.. బ్రోవో అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్’ అంటూ సెటైర్ వేశాడు. ఇక ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన డీజే బ్యూటీ పూజా రెండోసారి జోడీ కడుతుంది. హారిక, హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో చినబాబు, అల్లు అరవింద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ దరువు వేస్తుండగా.. టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, మురళీ శర్మ, సముద్ర ఖని, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్ రాహుల్ రామకృష్ణ ఇలా తెర నిండుగా ఉండేట్టు చాలా మంది నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34cuG7H
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...