Wednesday, 18 September 2019

‘సైరా’ ట్రైలర్.. 3 నిమిషాల పాటు హోరెత్తనున్న థియేటర్లు

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ ట్రైలర్ మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈరోజు సాయంత్రం 5.31 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ‘సైరా’ ట్రైలర్‌ను ఆన్‌లైన్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో కూడా లాంచ్ చేస్తున్నారు. అభిమానులు బిగ్ స్క్రీన్ మీద ట్రైలర్‌ను ఎంజాయ్ చేసే విధంగా ఈ ఏర్పాటు చేశారు. ఏపీ, తెలంగాణలో మొత్తం 96 థియేటర్లలో ఒకేసారి ‘సైరా’ ట్రైలర్ ప్రదర్శితంకానుంది. ‘సైరా’ ట్రైలర్ లాంచ్‌కు ఇప్పటికే థియేటర్లన్నీ ముస్తాబైపోయాయి. పాస్‌లు కూడా ఇచ్చేశారు. ఇక సాయంత్రం 5.31 గంటలకు థియేటర్లు మెగాస్టార్ స్లోగన్స్‌తో మార్మోగిపోవడం ఖాయం. ఇండస్ట్రీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ట్రైలర్ నిడివి 2.54 నిమిషాలు. ట్రైలర్‌ను చాలా బాగా కట్ చేశారట. సుమారు మూడు నిమిషాల ట్రైలర్‌తో సినిమాలో ఏం చూపించబోతున్నారో సూచన ప్రాయంగా చెప్పేస్తారు. ఈ మూడు నిమిషాలు థియేటర్లు హోరెత్తిపోతాయి. అంతేకాకుండా, ఈ ట్రైలర్ లాంచ్‌తో తెలుగు రాష్ట్రాల్లో ‘సైరా’ ప్రచార కార్యక్రమాలకు తెరలేపినట్టవుతుంది. Also Read: కాగా, ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యూఎస్‌లో అక్టోబర్ 1న ప్రీమియర్లు ప్రదర్శిస్తారు. అక్కడ స్నోఫ్లేక్ సినిమా సంస్థ ‘సైరా’ను విడుదల చేస్తోంది. ప్రీమియర్లను భారీ ఎత్తున ప్రదర్శించడం కోసం వీకెండ్ సినిమా, థింక్ బిగ్ పిక్చర్స్ సంస్థలతో స్నోఫ్లేక్ సినిమా చేయికలిపింది. మొత్తం మీద యూఎస్‌లో రికార్డు స్థాయిలో ప్రీమియర్లు ప్రదర్శించబోతున్నారు. ‘సైరా’ మొత్తం ఐదు భాషల్లో విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. కాబట్టి, ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నారు. ‘సైరా’ ట్రైలర్‌ను ప్రదర్శించే థియేటర్ల జాబితా


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2M2Kdi9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...