Wednesday, 25 September 2019

ఆ సినిమా చూసి 30 వేల మంది ప్రపోజ్ చేశారు- హృతిక్ రోషన్

లాంటి అందగాడు భర్తగా రావాలని కోరుకోని అమ్మాయి ఉండదు. ఆ అదృష్టం సుసాన్నే ఖాన్‌కు దక్కింది. ఆ తర్వాత మనస్పర్ధలు వచ్చి వీరిద్దరూ విడిపోయారునుకోండి. ఈ విషయం అటుంచితే.. 2000లో వచ్చిన ‘కహో నా ప్యార్ హై’ సినిమాతో హృతిక్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తన కెరీర్‌ను ప్రారంభించారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఆయనకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30000 ప్రపోజల్స్ వచ్చాయట. ఈ విషయాన్ని హృతిక్ ‘ది కపిల్ శర్మ షో’లో వెల్లడించారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘వార్’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హృతిక్ ‘ది కపిల్ శర్మ షో’కి వెళ్లి సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాలో హృతిక్‌కు జోడీగా అమీషా పటేల్ నటించారు. ఈ సినిమా విడుదలయ్యాక హృతిక్, అమీషాలకు విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది. అంతేకాదు ఐఫా ఫెస్టివల్‌లో గత 20 ఏళ్లలో ‘కహో నా ప్యార్ హై’ను మించిన మరో సినిమా మరేదీ లేదన్న కాంప్లిమెంట్‌ను దక్కించుకుంది. అంత మంది అమ్మాయిలు హృతిక్ కోసం ఎగబడినప్పటికీ ఆయన మాత్రం సుసాన్నే ఖాన్‌ను ఇష్టపడ్డారు. ‘కహో నా ప్యార్ హై’ సినిమా విడుదలకు ముందే హృతిక్, సుసాన్నే రిలేషన్ షిప్‌లో ఉన్నారు. హృతిక్ తన సినిమా కెరీర్‌ను స్టార్ట్ చేసినప్పుడే సుసాన్నేను పెళ్లి చేసుకుని ఎందరో ఆడపిల్లల హృదయాలను బద్దలకొట్టారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కానీ కొన్నేళ్ల తర్వాత హృతిక్, సుసాన్నేకు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. హృతిక్‌కు మరో హీరోయిన్‌తో సంబంధం ఉందన్న కారణంతో సుసాన్నే ఆయన్ను వదిలేశారని బాలీవుడ్‌ టాక్. అలా 2014లో హృతిక్, సుసాన్నే విడాకులు తీసుకున్నారు. అయినప్పటికీ పిల్లల కోసం తరచూ కలుసుకుంటూ ఉన్నారు. పిల్లలతో కలిసి విహారయాత్రలకు, డిన్నర్ పార్టీలకు, సినిమాలక వెళుతూ ఉంటారు. మరో విషయం ఏంటంటే.. హృతిక్, కంగనా రనౌత్ మధ్య ఎంతటి మాటల యుద్ధం జరిగిందో అందరికీ తెలిసిందే. హృతిక్ తనను ప్రేమించి మోసం చేశారని కంగన ఆరోపించారు. దాంతో హృతిక్‌కి కోపం వచ్చి తనను సినిమాల్లో తీసుకోనివ్వకుండా చేశారని కంగన ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అలా ఇద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. ఇంత జరిగినప్పటికీ సుసాన్నే.. తన మాజీ భర్త హృతిక్‌కే మద్దతు తెలిపారు. తనకు హృతిక్‌తో ఎంతటి పర్సనల్ గొడవలు ఉన్నా మరో అమ్మాయితో ఆయన అసభ్యకరంగా ప్రవర్తించారంటే తాను నమ్మనని సుసాన్నే వెనకేసుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2lEJomn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...