‘ముకుంద’, ‘కంచె’, ‘లోఫర్’ లాంటి విభిన్న కథాచిత్రాలతో నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకొని.. ‘ఫిదా’, ‘తొలిప్రేమ’, ‘అంతరిక్షం’, ‘ఎఫ్2’ వంటి సక్సెస్‌ఫుల్ కమర్షియల్ చిత్రాలతో ఫుల్‌స్వింగ్‌లో ఉన్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రస్తుతం ఆయన హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘వాల్మీకి’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో హీరో వరుణ్ తేజ్ బుధవారం మీడియా ముందుకు వచ్చారు. కాసేపు సినిమా గురించి ముచ్చటించారు. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆ విశేషాలు మీకోసం.. మీరు ఎక్కువ క్లాసీ రోల్స్‌లోనే నటించారు కదా! ఇప్పుడు పూర్తి స్థాయి మాస్ క్యారెక్టర్ చేయడం ఎలా అనిపించింది? ప్లేబోయ్ జోనర్‌లో చాలా సినిమాలు చేశాను. అయితే ఇప్పుడు ఈ మాస్ ఎక్స్‌పీరియన్స్ కొత్తగా ఉంది. మనం ఏ మాస్ క్యారెక్టర్ చేసినా దాని తాలూకు రీజన్ కరెక్ట్‌గా ఉండాలి. అప్పుడే దానికి పూర్తి న్యాయం చేయగలుగుతాం. ఈ సినిమాలో గద్దలకొండ గణేష్ క్యారెక్టర్ ఎందుకంత భయంకరంగా ఉంటుంది అన్నదానికి కరెక్ట్ రీజన్ చూపించారు హరీష్ శంకర్. అందుకే ఈ క్యారెక్టర్‌ను ఎంజాయ్ చేస్తూ చేశాను. ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది? ‘ఫిదా’, ‘తొలిప్రేమ’ తరువాత చాలా మంది దర్శకుల మాదిరిగానే హరీష్ గారు కూడా లవ్‌స్టోరీతో వచ్చారు. నిజం చెప్పాలంటే ఆయన చెప్పిన ‘దాగుడుమూతలు’ కథ అద్భుతంగా ఉంది. కానీ, ఇలాంటి లవ్ స్టోరీస్ మీరు చేయరు కదా? అని అడిగాను. మీరు ‘ఫిదా’, ‘తొలిప్రేమ’ చిత్రాలు చేశారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉందేమో అని ఈ కథతో వచ్చాను అన్నారు. దానికి లేదు సర్.. నేను మీతో మీ కైండ్ ఆఫ్ ఎంటర్‌టైనర్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాను. దాంతో ‘జిగర్తాండ’ చూశారా? అని అడిగారు. చూశాను సర్ అన్నాను. దాంతో ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది. తమిళ మాతృకలో ఎంతవరకూ మార్పులు చేశారు? ‘జిగర్తాండ’ ఒక వండర్‌ఫుల్ స్క్రిప్ట్. ఆ ఫీల్ పోకుండా మన నేటివిటీకి తగ్గట్టు ఫిఫ్టీ పర్సెంట్ చేంజెస్ చేశాం. గద్దలకొండ గణేష్ క్యారెక్టర్ ఎందుకంత భయంకరంగా ఉంటుందో చెప్పడానకి ఫ్లాష్ బ్యాక్ యాడ్ చేసి నిడివి కొంచెం ఎక్కువ చేశాం. మిగతా క్యారెక్టర్స్, కొన్ని సీన్లు ఎలాంటి మార్పు లేకుండానే తీశాం. ఈ క్యారెక్టర్ చేస్తున్నా అనగానే మీ ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్ ఏంటి? మా ఫ్యామిలీలో చాలా మంది ‘జిగర్తాండ’ సినిమా చూడలేదు. నా స్నేహితులు చాలా మంది కరెక్ట్ కాదేమో ఆలోచించుకో అన్నారు. నేను చిరంజీవి గారికి ఫోన్ చేసి డాడీ కథ ఇలా అనుకుంటున్నాను అన్నాను. తరువాత హరీష్, నేను వెళ్లి కలిసాం. కథ చాలా బాగుంది నువ్వు తప్పకుండా చేయాలి అని చిన్న చిన్న సజెషన్స్ ఇచ్చారు. హరీష్ గారు కూడా వాటిని అప్లై చేశారు. హరీష్ శంకర్ మేకింగ్ గురించి చెప్పండి. నేను ఈ క్యారెక్టర్‌ను ఇంతబాగా చేయడానికి హరీష్ గారు 100% హెల్ప్ చేశారు. ‘ఎఫ్2’లో తెలంగాణ యాస కొంచెం నీట్‌గా ఉంటుంది. కానీ, ఈ సినిమాకు వచ్చేటప్పడికి తెలంగాణ యాస కొంచెం కొట్టినట్లు ఉంటుంది. ఆయన డైలాగ్స్ కూడా సినిమాకు చాలా హెల్ప్ అవుతాయి. ఈ సినిమా ఇంతబాగా రావడానికి మేజర్ కారణం ఆయనే. ఈ క్యారెక్టర్ తమిళ్‌లో బాబీ సింహ చేశారు కదా? మీ మీద ఆయన ఇన్‌ఫ్లూయన్స్ ఉందా? బాబీ సింహ మన తెలుగువారే. ఆయనది విజయవాడ. ఆ క్యారెక్టర్ చేసినందుకు ఆయనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. నేను ఆయన క్యారెక్టర్‌ను ఇమిటేట్ చేయడానికి చూడలేదు. నా ఓన్‌గా ఆ క్యారెక్టర్‌ను రీక్రియేట్ చేయడానికి ట్రై చేశాను. ‘ఎల్లువచ్చి గోదారమ్మ’ సాంగ్ రీమిక్స్ చేస్తున్నప్పుడు ఏమైనా ప్రెజర్ ఫీలయ్యారా? జనరల్‌గా నాకు సాంగ్ అంటే ఒక ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్ ఫీలయ్యాను అంతే. ఎందుకంటే మొదటగా హరీష్ గారు ఈ సాంగ్ మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఆ సాంగ్ హిస్టరీ గురించి ఆయనకే ఎక్కువ తెలుసు. మిగతా విభాగాలన్నీ వారి పని వారు కరెక్ట్‌గా చేశారు. నేను డాన్స్ చేశాను అంతే. కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఆ సాంగ్ వేసినప్పుడు వచ్చిన రెస్పాన్స్ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. పూజ హెగ్డే క్యారెక్టర్ గురించి.. పూజతో నాలుగు సంవత్సరాల క్రితం ‘ముకుంద’ సినిమా చేశాను. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం. ఒక కోఇన్సిడెంట్ ఏంటంటే పూజతో ఫస్ట్ యానాంలో షూట్ చేశాం. ఇప్పుడు ‘ఎల్లువచ్చి గోదారమ్మ’ సాంగ్‌తో అదే యానాంలో షూటింగ్ పూర్తి చేశాం. తను యాక్టింగ్, డాన్స్ పరంగా చాలా ఇంప్రూవ్ అయింది. ఈ సినిమాలో దేవి క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా కుదిరింది. తన క్యారెక్టర్ సినిమాకు ఒక ప్లజంట్ ఫీలింగ్ తీసుకువస్తుంది. ఈ ఓల్డ్ లుక్‌కి ఏమైనా రిఫరెన్సు తీసుకున్నారా? ‘పునాదిరాళ్లు’, ‘వేట’ సినిమాలలో చిరంజీవి గారి క్యారెక్టర్‌ని రిఫరెన్స్‌గా తీసుకున్నా. డబ్బింగ్ చెప్పడానికి టైమ్ ఎక్కువ తీసుకున్నారంట? అవునండి చాలా ఎక్కువ తీసుకున్నా. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్‌లో 20 నిమిషాల సీక్వెన్స్ ఉంది. అది సినిమాకు చాలా కీలకం. అలాగే పెర్ఫామెన్స్‌కి బాగా స్కోప్ ఉన్న సీన్. సినిమాలో మేజర్ ట్విస్ట్ అది. ఒకే సారి రకరకాల ఎమోషన్స్‌ని పండించాలి. ఆ సీన్ థియేటర్‌లో ఆడియన్స్‌కి థ్రిల్ ఇస్తుంది. అలాంటి సీన్లు చాలా ఉన్నాయి. అందుకే కొంచెం టైమ్ తీసుకున్నాను.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2O5P58z
v
No comments:
Post a Comment