Wednesday, 14 August 2019

Sye Raa: ‘సైరా’ మేకింగ్ వీడియో.. స్వాతంత్య్ర వీరుడా జై చిరంజీవా

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సైరా’ మేకింగ్ వీడియో విడుదలైంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుక సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ మేకింగ్ వీడియోను బుధవారం నాడు విడుదల చేశారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈచిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, నయనతార, జగపతిబాబులకు సంబంధించిన మోషన్ పోస్టర్స్‌కి అద్భుతమైన స్పందన రావడంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ‘సైరా’ మేకింగ్ వీడియో ఉంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌కి సంబంధించిన స్టార్స్ చిత్రంలో కనువిందు చేస్తున్నారు. చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, తమన్నా, రవికిషణ్ నిహారిక తదితర పాత్రల్ని ఈ మేకింగ్ వీడియోలో రివీల్ చేశారు. హై టెక్నాలజీ వాల్యూస్‌తో, ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలతో అద్భుత దృశ్య కావ్యంగా ఈ చిత్రాన్ని మలిచారు. సైరా చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2H8GtKi
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...